ఉపేక్షించవద్దు


Fri,November 15, 2019 01:09 AM

కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతను నిర్వర్తించాలి. పర్యావరణ కాలుష్యం వల్ల వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. వీటివల్ల అతివృష్టి, అనావృష్టి మాత్రమే కాదు అనేక వ్యాధులకు కూడా కారణమవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ గురించి అలసత్వాన్ని వీడాలి. ప్రకృతికి హాని చేసే కారకాలను నియంత్రించాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇది పట్టణ ప్రాంతాల్లో బాగానే అమలవుతున్నది. కానీ క్షేత్రస్థాయిలోనూఇది పటిష్టంగా అమలయ్యేలా చూడాలి. అలాగే పర్యావరణానికి విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించవద్దు. పర్యావరణ పరిరక్షణ అన్నది అందరి బాధ్యత.
-కె. కృష్ణారావు, వరంగల్


ట్రాఫిక్‌ను నియంత్రించాలి

జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. రోజురోజుకూ వాహనాల సంఖ్య ఎక్కువ అవుతున్నది. దీంతో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. కాబట్టి దీన్ని క్రమబద్ధీకరణ చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికోసం ట్రాఫిక్‌ను మళ్లించే చర్యలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు చాలావరకు తగ్గే అవకాశం ఉన్నది.
-షేక్ అస్లాంషరీఫ్, శాంతినగర్

వేగానికి అడ్డుకట్ట వేయాలి

రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదాల నివారణకు రవాణ శాఖ అధికారులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. అతివేగమే అనేక ప్రమాదాలకు కారణం అన్నది విదితమే. ముఖ్యంగా హైవేల మీద వేగంగా వెళ్లే వాహనాలను నియంత్రించడంలో రవాణ అధికారులు దృష్టి సారించడం లేదు. అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయి. అట్లనే వేగంగా వెళ్లే వాహనదారులను గుర్తించాలి. వారికి గట్టి హెచ్చరికలు జారీచేయాలి. అప్పుడే ప్రమాదాలు నివారించగలుగుతాం.
-మాటూరి మధు, హైదరాబాద్

135
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles