మత సామరస్యానికి ప్రతీక


Sat,November 16, 2019 12:38 AM

శతాబ్దాల వివాదాంశానికి సుప్రీంకోర్టు ముక్తాయింపు పలుకడం హర్షణీయం. బాబ్రీ మసీదు, రామ జన్మభూమి వివాదానికి తెరదించుతూ వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా నిర్ణయించి అప్పగించటం, ముస్లింలకు మసీదు నిర్మించుకోవటానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించ టం ఆహ్వానించదగినది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాబ్రీమసీదు కూల్చటం తప్పు అని తేల్చిన సుప్రీంకోర్టు, కూల్చినవారితోనే మసీదును నిర్మించి ఇవ్వాలని తీర్పు ఇచ్చి ఉంటే ముస్లింలు కూడా మరింత సంతృప్తి చెందేవారు. అయితే రామ మందిరంలో తాము కూడా ఇటుక పేరుస్తామని ముస్లిం పెద్దలు ప్రకటిం చటం మత సామరస్యానికి ప్రతీక.
- శ్రీధరాచార్యులు, సీతారాంబాగ్, హైదరాబాద్


కార్మికులారా మెట్టుదిగండి

ఆర్టీసీ కార్మికులారా మీరు చేస్తున్న పోరాటం చారిత్రాత్మకం. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. అయితే పంతానికి పోయి మీ కుటుంబాలను మరింత కష్టాలపాలు చేయొద్దు. ఇరువర్గాలూ పట్టుదలకు పోతే వేలాది మంది కార్మికులతో పాటు ఆర్టీసీ సంస్థ కూడా తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి కార్మికుల తరఫున ప్రభుత్వంతో సంప్రదింపులకు పెద్దలతో కూడిన ఓ బృందాన్ని ఎంచుకొని పంపండి. వారే ప్రభుత్వంతో చర్చించి సమస్యను కొలిక్కితెస్తారు.
- సీహెచ్ మధు, నిజామాబాద్

స్వైన్ ఫ్లూ విజృంభనను నియంత్రించాలె

ఈ మద్యకాలంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు మునుపెన్నడూ లేనిస్థా యిలో విజృంభిస్తున్నాయి. డెంగ్యూతో అనేకమంది మృత్యువాత పడ్డారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ నగరంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తున్నదని అంటున్నారు. ఇది కూడా ప్రాణాంతకమైనదే. కాబట్టి ప్రభుత్వం, ఆరోగ్యశాఖ అధికారులు తగుచర్యలు తీసుకొని స్వైన్ ఫ్లూ విస్తరించకుండా తగు చర్యలు తీసుకోవాలి. వ్యాధిసోకిన వారికి సరైన వైద్యం అందేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
- విష్ణు, హయత్‌నగర్, హైదరాబాద్

120
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles