హ్యాట్సాఫ్ కేసీఆర్

Thu,August 1, 2019 12:43 AM

తలాపున పారుతుంది గోదారి, మన చేను మన చెలుక ఏడారి.. ఓ కవి రాసిన ఈ పాట ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాల పనితీ రును తేటతేల్లం చేసింది. తెలంగాణలో ప్రవహిస్తూ గోదావరి పోతున్నా, సుక్క నీరు లేక తెలంగాణ రైతులు తల్లడిల్లిపోయే వారు. విధిలేక ఉపాధి కోసం వలసబాట పట్టేవారు. అసొంటి గోదావరి కడుపు నిం డా నీళ్లతో కళకళలాడుతున్నది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, లాంటి బరాజ్‌లు నీటి తో నిండుకున్నా యి. దీంతో రాష్ట్రంలోని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టును అం దుబాటులోకి తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ కు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. హ్యాట్సాఫ్ కేసీఆర్ అంటూ జేజేలు పలు కుతున్నారు.
- జీడిపల్లి లింగారావు, రామకృష్ణకాలనీ, కరీంనగర్

బాధితురాలికి న్యాయం చేయాలె

యూపీ ఉన్నావ్ ఘటన జరిగిన తీరు చూస్తుంటే హృదయం ద్రవించిపో తున్నది. అధికార పార్టీ ఎమ్మెల్యే తనపై ఆత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. తనకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తానని అత్యాచార బాధితురాలు మొండి కేసి కూర్చోవటం ఆమె ప్రాణాల మీదికే తెచ్చింది. ఇటీవల అత్యాచార బాధితురాలు, న్యాయవాది, ఇద్దరు సాక్షులు ప్రయాణిస్తున్న కారును గుర్తుతెలియని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సాక్షులు అక్కడి కక్కడే మరణించారు. కాగా బాధితురాలు, న్యాయవాది మృత్యువుతో పోరాడుతున్నారు. ఇది సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన పనేనని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, పౌరసంఘాలు ఆరోపిస్తున్నాయి. కానీ యాక్సి డెంట్‌ను కుట్రకోణంగా చూడటం సరికాదంటూ రాష్ట్ర డీజీపీ ప్రకటించ టం సిగ్గుచేటు. నాకు, నా కుటుంబానికి ఎమ్మెల్యే నుంచి బెదిరింపులు వస్తున్నాయని, ప్రాణహాని ఉన్నదని బాధితురాలు భారత ప్రధాన న్యాయ మూర్తికి లేఖ రాసినా పట్టించుకోలేదు. ఫలితంగా ఇంతటి ఘాతుకం జరిగింది. ఇప్పటికైనా బాధితురాలికి మెరుగైన వైద్యసేవలందించి ఆమె ప్రాణాలను కాపాడి, నిందితులను కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత భారత సుప్రీం కోర్టు తీసుకోవాలె.
- నారదాసు రాజేందర్, తార్నాక, హైదరాబాద్

143
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles