దేశానికి శుభోదయం

Tue,August 6, 2019 11:09 PM

డ్బ్భై ఏండ్లుగా ఎదురుచూస్తున్న భారత ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి. ఆర్టికల్ 370ని చెత్తబుట్టలో పడేసింది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం. ఈ చర్యతో దేశంలోని రాష్ర్టాలన్నింటికీ ఒకే చట్టం వర్తిస్తుంది. అన్ని రాష్ర్టాలకూ సమాన ప్రతిపత్తి ఉంటుంది. ఈ సాహసోపేతమైన నిర్ణయానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా లకు దేశంలోని సమస్త ప్రజానీకం జేజేలు పలుకుతున్నది. దేశంలోని ప్రతిపక్ష పార్టీ లు, ప్రాంతీయపార్టీలు స్వాగతిస్తున్నాయి. ఇది హర్షణీయం. దేశాన్ని యాభై ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ చేయలేని పని బీజేపీ చేసిందని అభినందించాల్సిందిపో యి వ్యతిరేకించటం సిగ్గుచేటు. ఇకనైనా కాంగ్రెస్ వైఖరిలో మార్పురావాలె.
- గులాబీల మల్లారెడ్డి, కరీంనగర్

పిల్లల్లో సత్ప్రవర్తన అలవర్చాలి

పిల్లల పట్ల కఠినంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో తల్లిదండ్రులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదని చట్టాలు చెబుతున్నాయి. అందుకే ముందునుంచే పిల్లల్లో మంచి నడవడికను అలవాటు చేయాలి. ఉదయా న్నే నిద్రలేపడం, వ్యక్తిగత శుభ్రత, పొద్దున లేచి చదువుకోవడం, రాత్రి తొందరగా నిద్రపోవడం, సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉంచడం లాంటివి అల వాటు చేయాలి. మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం లాంటి విషయా ల పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలి. ఇలాంటి జాగ్రత్తలు పిల్లల్లో సత్ప్రవర్తనకు బీజం వేస్తాయనడంలో సందేహం లేదు. పిల్లలు ఎక్కువ శాతం తల్లి దండ్రులను అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు పై విషయాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చిన్నారుల చుట్టూ సానుకూల, సంతోషకరమైన వాతావరణాన్ని ఏర్పరుచాలి. దీనివ ల్ల పిల్లల్లో క్రమశిక్షణ ఏర్పడుతుంది. వారిలోని నైపుణ్యాలను వెలికితీసి ఏయేరంగంలో వారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారో ఆ దిశగా పిల్లలను ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అప్పుడే తమ పిల్లలు విజ యం వైపు దూసుకువెళ్తారనే విషయం తల్లిదండ్రులు మరువకూడదు. ఆ దిశగా తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకోవాలె.
- నర్మాల మనీశ్, లక్ష్మీనగర్, కరీంనగర్

120
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles