ఉరిశిక్ష సరైనదే

Sat,August 10, 2019 01:04 AM

వరంగల్ చిన్నారి శ్రీహితపై అత్యాచారం చేసి, హత్యచేసిన నిందితుడికి వరంగల్ జిల్లా ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష వేయడం పట్ల యావత్ రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది. కేవలం 48 రోజుల్లోనే కేసు దర్యాప్తును పూర్తిచేయడం పట్ల పోలీసు అధికారుల పనితీరును కూడా ప్రజలు అభినందిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ అత్యాచారం చేసి హత్యచేసిన నిందితుడికి ఉరివేయడంతోనే ఇలాంటి ఘటనలకు ముగింపు పడుతుందనుకోవ డం సరికాదు. ఘటనకు సంబంధించిన కారణాలను విశ్లేషించి దానికి సంబంధిం చిన మూలాలను నిర్మూలించాల్సిన అవ సరం ఎంతైనా ఉన్నది. ఈ సామాజిక, లైం గిక హింసకు కారణమవుతున్న అంత ర్జా లంలోని కొన్ని సైట్లను నిషేధించాలె.
- చుంచు అరుణ్‌కుమార్, మంచిర్యాల

ప్రతిపక్షాల్లో మార్పు రావాలె

నూతన హంగులతో సరికొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలను ప్రారంభిస్తుంటే, సందెట్లో సడేమియా అన్నట్లు ప్రతిపక్షా లు వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అడ్డుపడటం ప్రతిపక్షాలకు అలవాటైపోయింది. ప్రతిపక్షాల సూచనలు నిర్మాణాత్మకంగా, సహేతుకంగా ఉండాలె కానీ, పనిగట్టుకొని విమర్శలు చేయడాన్ని ఎవరూ స్వాగతించరు. ప్రతిపక్షాలు ఇలాగే వ్యవ హరిస్తే వచ్చే ఎన్నికల నాటికి ఉనికిని కోల్పోతాయని రాజకీయ విశ్లేష కుల అభిప్రాయం.
- జీడిపల్లి లింగారావు, కరీంనగర్

అదనపు బస్సులు కేటాయించాలె

మరికొన్ని రోజుల్లో రాఖీ పండుగ రాబోతున్నది. దీనికోసం ఆర్టీసీ అధికా రులు ముందస్తు వ్యూహంతో వ్యవహరించాలి. ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు బస్సులను ఏర్పాటుచేయాలె. లేకపోతే ప్రయాణికుల ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. లేకుంటే ప్రైవేట్ వాహనదారులు అవకాశంగా తీసుకొని అందనికాడికి దండుకునే అవకాశాలున్నాయి.
- కొలిపాక శ్రీనివాస్, పెద్ద సముద్రాల, కరీంనగర్

298
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles