కౌన్సెలింగ్ ఇవ్వాలె

Sat,August 31, 2019 12:39 AM

వినాయక నవరాత్రులను ఆనందంగా, భక్తీశ్రద్ధలతో జరుపుకోవాలే తప్పా భక్తీ పేర పెడ ధోరణులకు పాల్పడటం సమంజసం కాదు. విద్యార్థులు ప్రతిరోజు తెల్లవారుజా మున చదువుకుంటారు. మంటపాల్లో ఎక్కువ సౌండ్‌తో పెట్టే భక్తి పాటల వల్ల విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడు తుంది. నిమజ్జనోత్సవాలు ఒక్కోచోట ఒక్కోరోజు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాల్లో యువత పెద్ద ఎత్తున పోగై మద్యం సేవించటం, గొడవలు పెట్టుకోవ డం లాంటి ఘటనలు ఏటా జరుగుతుండ టం చూస్తూనే ఉన్నాం. కొందరు గాయాల పాలవుతున్నారు. కాబట్టి పోలీసు అధికా రులు మంటప నిర్వాహకులను బాధ్యు లను చేస్తూ ముందస్తుగా కౌన్సెలింగ్ ఇవ్వాలె.
- కొలిపాక శ్రీనివాస్ గౌడ్, సముద్రాల

సూచికల బోర్డులు ఏర్పాటుచేయాలె

ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవటంతో రాష్ట్రవ్యా ప్తంగా వానలు జోరుగా కురుస్తున్నాయి. అయితే నగరాల్లో మాత్రం నీరు ఎక్కడికక్కడ పేర్కొంటుండటంతో ఎక్కడ మ్యాన్‌హోల్స్ ఉన్నాయో, ఎక్కడ లేవో వాహనదారులు గుర్తుపట్టలేకపోతున్నారు. జీహెచ్‌ఎంసీతో పాటు కార్పొరేషన్, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని మ్యాన్‌హో ల్స్ ఉన్నచోటల్లా సూచికల బోర్డులు ఏర్పాటుచేయాలె.
- పెరుక శ్రావణ్, గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా

డాక్టర్ కూరెళ్ల అభినందన సభ

దాశరథి పురస్కార గ్రహీత కూరెళ్ల విఠలాచార్య అభినందన సభ 2019 సెప్టెంబర్ 1న ఉదయం 10.30 గంటలకు నల్లగొండలోని చినవెంకట్‌రెడ్డి మినీ ఫంక్షన్ హాలులో జరుగుతుంది. వేణు సంకోజు అధ్యక్షతన జరుగు సభలో ముఖ్య అతిథులుగా సుద్దాల అశోక్ తేజ, కంచర్ల భూపాల్‌రెడ్డి (ఎమ్మెల్యే) హాజరవుతారు. ఆత్మీయ అతిథులుగా డాక్టర్ ఎస్. రఘు, డాక్టర్ బెల్లి యాదయ్య, డాక్టర్ కృష్ణ కౌండిన్య, డాక్టర్ పోరెడ్డి రంగయ్య తదితరులు హాజరవుతారు. అందరికీ ఆహ్వానం.
- పెందోట సోము, దాసోజు జ్ఞానేశ్వర్, తేజస్వినీ సాహిత్య సాంస్కృతిక వేదిక

90
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles