అవిఘ్నమస్తు..!!

Wed,September 4, 2019 12:22 AM

avignamasthu
విఘ్నాలను హరించమని
వినాయకుడిని వేడుకుంటారు
ఆనక ప్రకృతిని హరించే చేష్టలతో
వినాశనాన్ని కోరి తెచ్చుకుంటారు
యేటేటా జరిపే గణపతి ఉత్సవాలు
మత సామరస్యానికి ప్రతీకలు
ఆలోచనలకు అందని ఆర్భాటాలతో
యేటికేడు పెరిగే వినాయక విగ్రహాలు
రసాయన రంగుల వాడకంతో
కలుషితమవుతున్న పర్యావరణం
వన్య సంపద అంతర్ధానంతో
మలినమవుతున్న మట్టి పరిమళం
కావొద్దు మనం చేసే పనులతో
సహ జీవరాశుల వినాశనం
మన జీవనానికి మూలమైన
మట్టిని గణపతిగా చేసి పూజిద్దాం
పెద్ద మనసుతో చిన్న గణపతులను
వీలైతే విలేజికొక్క వినాయకుడిని
ప్రతిష్టించీ మనసారా పూజిద్దాం
ప్రకృతిని సత్ప్రవర్తనతో ప్రేమిద్దాం..
అవిఘ్నమస్తుగా జీవిద్దాం..!!

- పాల్వంచ హరికిషన్
95024 51780

111
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles