రాజకీయ ప్రయోజనం కోసమే...


Thu,September 26, 2019 01:13 AM

‘హౌడీ మోదీ’.. ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటున్న అంశం. అమెరికాలోని హ్యూస్టన్‌లో వేలాదిమంది ప్రవా స భారతీయులతో నిర్వహించిన సభ. ఇది ఎలాంటి సంకేతాలిస్తున్నదనేది అసలు విషయం. భారత్‌లో పడిపోతున్న ఆర్థికవ్యవస్థ, జమ్ముకశ్మీర్‌ వివాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అట్లాగే దేశ ఆర్థికవ్యవస్థ కుదేలుకు కారణమైన అమెరికా విధానాలున్న నేపథ్యంలో మోదీ పర్యటన కీలక ఫలితాలనిస్తుందని అందరూ ఆశించారు. కానీ అవేమీ జరుగలేదు. పైగా వీటినుంచి దృష్టి మళ్ల్లించడానికే అన్నట్టు ఈ పర్యటన సాగింది. వచ్చే ఏడాది ఆమెరికా ఎన్నికలు. కాబట్టి ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఉండే ప్రవాస భారతీయులను అనుకూలంగా మార్చాలి. ఇద్దరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఇద్దరూ పన్నిన ఓ రాజకీ య ఎత్తుగడగానే ‘హౌడీ మోడీ’ మీటింగ్‌ను చూడాలి. ఇత ర దేశంలో అధ్యక్ష పోటీలో ఉండే అభ్యర్థికి దేశప్రధాని బహిరంగంగా ప్రచారం చేయడం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. మోదీ మొదటి ఇన్నింగ్స్‌లో పార్లమెంట్‌ కంటే విదేశీ పర్యటనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.


రెండోసారి కూడా అంతే. మరోవైపు భావోద్వేగాలతో అనుకూల పరిస్థితులను సృష్టించుకోడం మోదీకి కొత్తేమీ కాదు. ‘హౌడీ మోదీ’లో కూడా అలాగే జరిగింది. హిందీ భాషా వివాదం దేశమంతా చెలరేగగా హ్యూస్టన్‌ వేదికగా 8 భాషాల్లో ‘అం తా బాగుంది’ అని మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచిం ది. ఇది అసలు సమస్య నుంచి అందరి దృష్టినీ మళ్లించి భావోద్వేగానికి గురిచేయడం కాకుండా ఇంకేం అవుతుం ది. దేశ పరిస్థితి నిజంగా అంత బాగున్నదా? అంత బాగుం టే అర్థిక మాంద్యం ఎందుకు వస్తుంది? దేశం ఎన్నడూ లేని సవాల్‌ను ఎందుకు ఎదుర్కొంటున్నది? ట్రంప్‌నకు వ్యతిరేక సర్వేలు రావడంతో మోదీ అక్కడా భావోద్వేగ రాజకీయాలకు తెరతీశాడు. వ్యవహారమంతా ఇద్దరి వ్యక్తిగత ప్రయోజనాల కోసమేననుకోవడంలో సందేహం లేదు. మోదీ తన ఇమేజ్‌ను పెంచుకొనేందుకే ఈ పర్యటనలు తప్పా దేశాభివృద్ధికి మాత్రం కాదు? ఇట్లా విదేశాల్లో రాజకీయ ప్రచారం చేసి ప్రతిష్టను పెంచుకొనే చర్యలు విదేశాంగ నీతిని కాలరాయడమే.
- వినోద్‌ మామిడాల, హైదరాబాద్‌

107
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles