ప్రమాదంలో ప్రజారోగ్యం


Thu,September 26, 2019 11:17 PM

2019 సెప్టెంబర్ 29 ఆదివారం రోజున సాయంత్రం 5 గంటలకు శ్రీ రాజరాజనరేంద్రాంధ్ర భాషా నిలయం హన్మకొండలో ప్రజా ఆరోగ్యం-ప్రభుత్వాల వైఖరి సద స్సు జరుగనున్నది. ప్రపంచీకరణ మాయాజాలంలో ఆరో గ్యం 1990ల నుంచి వీచిన ప్రపంచీకరణ పవనాలు వైద్యం రూపురేఖలనే మార్చేశాయి. ఇంతకుముందు వైద్యం అంటే వ్యాధిని నయం చేయడమే ధ్యేయంగా ఉం డేది. నేడు రోగి కిడ్నీలతో పాటు శరీర భాగాలపై వ్యాపారం చేసుకోవడమే ధ్యేయంగా మారింది.


వైద్యం ప్రభుత్వం చేతుల్లో నుంచి పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్లోకి మారిపోయింది. ఈ మోడ ల్లో అత్యంత చౌకగా దవాఖానల కోసం ప్రభుత్వం నుంచి భూమిని కార్పొరేట్లు సంపాదిస్తూ రాయితీలు పొందుతారు. కానీ వైద్యసేవలను ప్రజలకు అందించేటప్పుడు ఫీజు చెల్లించలేదని శవాలను కూడా ఇవ్వకుండా కనీస మానవతా విలువలను కూడా పాటించడం లేదు. విజ్ఞానశాస్త్రంలో వచ్చిన అధునాతన అవకాశాన్ని ప్రవేట్ దవాఖానలు తమకు అణుగుణంగా మార్చుకుంటున్నాయి. వైద్యంలో జరుగుతున్న దోపిడీని అరికట్టే నిబద్ధత కలిగిన వ్యవస్థ రావాల్సిన అవసరం ఉన్నది. ఆరోగ్యం కోసం కేంద్రం బడ్జెట్ కేటాయింపులు పెరిగేలా పాలకులపై ఒత్తిడిని పెంచాలి.

సమస్యకున్న విభిన్న పార్శ్వాలు పరిశీలించనంత కాలం, ఆరోగ్యాన్ని, వైద్యాన్ని స్వేచ్ఛా వాణిజ్యం, ప్రపంచీ కరణ, నయా ఉదారవాదం సంకెళ్ల నుంచి విముక్తి చేయనంతకాలం, దవాఖానల్లో సమూలమైన మౌళిక మార్పు లు చేయనంతకాలం ప్రజలకు సరైన, న్యాయమైన వైద్య సేవలు అందవు. సరుకు నుంచి హక్కుగా వైద్యం మారనంతకాలం పొడిపొడి మార్గాల ద్వారా పేద ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. రానున్న రోజుల్లో పేద ప్రజలకే కాదు మధ్యతరగతి ప్రజలకు కూడా వైద్యం అందని ద్రాక్షనే అవుతుందనడంలో సందేహం లేదు.

ఈ స్థితి మారాలంటే పౌర సమాజం మేల్కొని ఉద్యమించాల్సిందిగా వరంగల్ పౌర స్పందన వేదిక పిలుపునిస్తున్నది. కాబట్టి 29న జరిగే కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. ఈ సదస్సులో నల్లెల్ల రాజయ్య, కొండ్రెడ్డి మల్లారెడ్డి, డాక్టర్ తిరుపతయ్య, డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ చంద్రభాను, హనుమాన్ ప్రసా ద్, పాలడుగుల సురేందర్ హాజరుకానున్నారు.

- వరంగల్ పౌర స్పందన వేదిక

123
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles