ఆర్థిక వినతులు
రాష్ర్టాన్ని సందర్శించిన 15వ ఆర్థిక సంఘానికి పలు పార్టీలు సంఘాల నుంచి వినతులు వెల్లువెత్తాయి. కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి ఇతోధికంగా సాయమందించి అభివృద్ధికి చేయూతనందించాలని కోరాయి. నందకిశోర్సింగ్ నేతృత్వంలోని ఆర్థిక సంఘం రాష్ట్రం చెల్లిస్తున్న పన్ను ల్లో వాటా, అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపు, ప్రాధాన్యాంశాల అధ్యయనానికి వచ్చి న నేపథ్యంలో రాజకీయాలకతీతంగా రాష్ర్టాభివృద్ధికి సాయమందించాలని ఆర్థికసంఘాన్ని కోర టం ముదావహం. అయితే ఆర్థిక సంఘం నిధుల కేట...