మొటిమ‌ల‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!


Tue,December 25, 2018 02:52 PM

ముఖం ఎంత అందంగా ఉన్న‌ప్ప‌టికీ ముఖంపై మొటిమ‌లు వ‌స్తే చూసేందుకు అంద విహీనంగానే ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితి చాలా మందికి ఎదుర‌వుతుంటుంది. అందుకు గాను వారు ర‌కర‌కాల క్రీములు గ‌ట్రా రాస్తుంటారు. కానీ కింద తెలిపిన చిట్కాలు పాటిస్తే మొటిమ‌లను త‌గ్గించుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే...

1. పుదీనా ఆకుల రసం మొటిమలపై రాసి రాత్రంతా వదిలేసి ఉదయాన్నే కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే కొద్ది రోజుల్లోనే మొటిమ‌లు పోతాయి. ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది.

2. టీస్పూన్ మోతాదులో బియ్యం, గసగసాలూ, బాదం గింజలను తీసుకుని మెత్తగా చేయాలి. ఈ మిశ్రమానికి రెండు టీస్పూన్ల‌ పెరుగు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేస్తే మొటిమలతో పాటు వాటి తాలూకు మచ్చలు కూడా మాయమవుతాయి. ముఖంపై చ‌ర్మం మృదువుగా మారుతుంది.

3. సమపాళ్లలో శనగపిండీ, పెరుగూ తీసుకుని మిశ్రమంలా చేసి ముఖానికి రాయాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తే మొటిమ‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

4. దాల్చిన చెక్క పొడిలో కాసిని నీళ్లు పోసి మొటిమలున్న చోట రాయాలి. ఇలా పది రోజులకోసారి చేయాలి. దీని వ‌ల్ల మొటిమ‌లు త‌గ్గ‌డ‌మే కాదు, ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది.

5. శనగపిండిలో కొంచెం తేనె వేసి కలిపి ముఖానికి రాయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది. అలాగే
తులసి ఆకుల్ని మెత్తగా చేసి ముఖానికి పట్టించినా సరిపోతుంది. దీంతో ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మొటిమ‌లు పోతాయి. ముఖం ప్ర‌కాశిస్తుంది.

6. మెంతి ఆకుల్ని మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు మొటిమలపై రాసి ఉదయాన్నే కడిగేయాలి.

7. నారింజ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేయాలి. దీనికి కొన్ని నీళ్లు చేర్చి రాత్రిపూట మొటిమలపై రాయాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే మొటిమ‌లు త‌గ్గుతాయి.

8. టీ స్పూన్ నిమ్మరసానికి అరటీస్పూన్‌ పచ్చి పాలు చేర్చి ముఖంపై రాసి అరగంట తర్వాత కడిగేసినా మొటిమ‌లు త‌గ్గుతాయి.

9. టీస్పూన్‌ కొత్తిమీర రసానికి చిటికెడు పసుపు చేర్చి సమస్య ఉన్నచోట రాయాలి. ఇలా వారం పాటు క్రమం తప్పకుండా చేస్తే ఫ‌లితం ఉంటుంది.

10. కీరదోస గుజ్జును ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేసినా మొటిమ‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ముఖం కూడా కాంతివంతంగా మారుతుంది.

3330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles