కిడ్నీ స్టోన్ల‌ను క‌రిగించే ఎఫెక్టివ్ టిప్స్‌..!


Sat,November 11, 2017 05:47 PM

వాతం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోయి ఆ తర్వాత కణాల లోపలి భాగాలపై కాల్షియం, ఫాస్ఫేట్స్‌, ఆక్సిలేట్స్‌ రసాయనాలు పేరుకొని పోయి మూత్రపిండాల్లో రాళ్లుగా పరిణామం చెందుతాయి. ఆయుర్వేద శాస్త్ర రీత్యా మూత్రపిండాల్లో రాళ్ల వ్యాధిని ‘మూత్రాశ్మరి’ అంటారు. మూత్రపిండాల్లోని రాళ్లు కొద్ది కొద్దిగా కరిగి, మూత్రనాళంలోకి దిగి ఇరుకైన సన్నని భాగాల్లో చిక్కుకుపోతాయి. ఇవి ప్రమాదకరంగా మారుతాయి. ఈ క్ర‌మంలో స‌రైన చికిత్స తీసుకోవ‌డం ఉత్త‌మం. లేక‌పోతే వ్యాధి తీవ్ర‌త పెరిగి కిడ్నీలు ఫెయిల్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే కిడ్నీ స్టోన్ల‌ను కరిగించేందుకు మ‌న‌కు అందుబాటులో ఎలాంటి స‌హ‌జ సిద్ధ‌మైన ఔష‌ధాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..!

1. ఒక టీస్పూన్‌ తులసి ఆకు రసంలో అంతే మోతాదులో తేనె కలిపి ప్రతీరోజూ ఉదయాన్నే సేవించాలి. కనీసం ఆర్నెళ్లు ఇలాగే చేస్తే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.

2. కొండపిండి మొక్క‌ వేరు చూర్ణాన్ని తయారు చేసుకోవాలి. దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అంతే మోతాదులో నీరు క‌లిపి సేవించాలి. లేదా 30ఎంఎల్ నీటిలో కొండపిండి వేరు రసాన్ని క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. ఇలా మూడుపూటలా తీసుకోవాలి. లేదా కొండపిండి ఆకు కషాయంను కాచి దాన్ని పెసర పప్పుతో కలిపి కూరగా వండుకు తినటం అలవాటు చేసుకోవాలి. దీంతో కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.

3. ఉలవల్లో ముల్లంగి ఆకులు సన్నగా తరిగి కలిపాలి. నీళ్లు బాగా పోసి ఉడికించాలి. పై నీటిని తీసి చారు చేసుకోవాలి. ఈ ఉలవచారు రోజూ తాగితే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.

4. తెల్ల గలిజేరు వేరును నీటిలో మెత్తగా నూరాలి. దాన్ని ఒక కప్పు నీటిలో ఒక రోజు రాత్రంతా నాన బెట్టి ఉదయాన్నే వడబోసి తర్వాత తాగాలి. దీంతో మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోతాయి.

5. తాజా మామిడి ఆకులను నీడలో ఎండబెట్టి మెత్తగా పొడిచేసి రోజూ పొద్దున్నే నీటితో కలిపి తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోయే అవకాశం ఉంది.

6. అల్లనేరేడు గింజల చూర్ణాన్ని ప్రతి రోజూ తీసుకుంటే కిడ్నీలో రాళ్లే కాదు మూత్రనాళంలో ఉండే రాళ్లు కూడా కనుమరుగవుతాయి.

7. తరచూ ఆపిల్‌ జ్యూస్‌ తాగుతూ ఉంటే మూత్రాశయంలోని చిన్న చిన్న రాళ్లు కరిగిపోతాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా పెద్దరాళ్లు కూడా కరగడం ప్రారంభమవుతుంది.

8. ఒక టేబుల్ స్పూన్‌ మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి పరగడుపునే ఆ నీటిని తాగాలి. దీనివల్ల కిడ్నీలో రాళ్లు కరగడమే కాదు, శరీరంలో పేరుకుపోయే విషపదార్థాలు తొల‌గి పోతాయి.

9. వేపాకులు కాల్చి బూడిద చేసి ఒకరోజు నిల్వ ఉంచి అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని ఒకటిన్నర గ్రాముల చొప్పున‌ నీటిలో కలిపి ఉద‌యం, సాయంత్రం రెండు పూటలా తాగితే రాళ్లు క‌రిగిపోతాయి.

10. కొత్తిమీర వేసి మరిగించిన నీటిని తాగినా కిడ్నీలో రాళ్లు క‌రుగుతాయి.

11. ప్రొద్దు తిరుగుడు చెట్టు వేర్లు తెచ్చి వాటిని నీడిలో ఎండ‌బెట్టి పొడి చేసి దాన్ని 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని లీటరు మజ్జిగలో కలిపి తాగాలి.

12. అరకిలో పెసరపప్పును లీటరు మంచి నీళ్లలో కలిపి కాచి తర్వాత పైన తేరిన కట్టును తాగితే రాళ్లు పడిపోతాయి.

10605
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles