పొట్ట దగ్గర కొవ్వు కరగాలా ? వీటిని తీసుకోండి..!


Mon,June 11, 2018 06:21 PM

నేటి తరుణంలో అధిక శాతం మందిని ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. దీంతోపాటు చాలా మందికి పొట్ట దగ్గర అధికంగా కొవ్వు పేరుకుపోతుండడం వల్ల వారు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే అలాంటి వారు కింద సూచించిన పలు పదార్థాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో పొట్ట దగ్గర కొవ్వునే కాదు, అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. మరి పొట్ట దగ్గర కొవ్వు కరగాలంటే తీసుకోవాల్సిన ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. వాము


అధిక బరువును తగ్గించుకునేందుకు వాము ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక లీటర్ నీటిని తీసుకుని అందులో ఒక టీస్పూన్ వాము వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని చల్లార్చి రోజులో కొద్ది కొద్దిగా తాగుతుండాలి. దీంతో చాలా త్వరగా బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది.

2. పెసలు


శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను కరిగించి అధిక బరువును తగ్గించడంలో పెసలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వీటిల్లో విటమిన్ ఎ, బి, సి, ఇ లతోపాటు అనేక ఖనిజాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో సహాయం చేస్తాయి. నిత్యం ఒక కప్పు పెసలను ఉడకబెట్టుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది.

3. గోధుమ రవ్వ ఉప్మా


గోధుమ రవ్వతో తయారు చేసిన ఉప్మాను రోజులో ఏదో ఒక పూట తినాలి. నిత్యం తినే ఆహారానికి బదులుగా దీన్ని తింటే చక్కని ఫలితం ఉంటుంది. అధిక బరువును ఇట్టే తగ్గించుకోవచ్చు.

4. సబ్జా విత్తనాలు


సబ్జా గింజల్లో విటమిన్ ఎ, ఇ, కె, బి లు, డైటరీ ఫైబర్, కాపర్, క్యాల్షియం, ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషణను అందిస్తాయి. శరీరంలో ఉన్న విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి. అధిక బరువును, పొట్టను తగ్గిస్తాయి.

9334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles