జీర్ణ స‌మ‌స్య‌లను త‌గ్గించే వంటింటి ఔష‌ధాలు..!

Sat,December 29, 2018 04:40 PM

ప్ర‌స్తుత త‌రుణంలో అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి కార‌ణంగా చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. వాటిల్లో జీర్ణ స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి త‌దిత‌ర జీర్ణ స‌మ‌స్య‌ల‌తో చాలా మంది స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అయితే వీటికి ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. అల్లం

భార‌తీయులు త‌మ త‌మ ఇండ్ల‌లో ఎంతో కాలం నుంచి అల్లంను అనేక ర‌కాలుగా వాడుతున్నారు. అనేక ర‌కాల వంట‌ల్లో అల్లాన్ని వారు ఉప‌యోగిస్తున్నారు. జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ అల్లం అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక‌టి రెండు టీస్పూన్ల అల్లం ర‌సంను తాగుతుంటే జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

2. న‌ల్ల మిరియాలు

రుచికి మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి. కానీ వీటిలో బోలెడు ఔష‌ధ గుణాలు ఉంటాయి. మిరియాల‌ను పొడిలా చేసి పాల‌లో క‌లుపుకుని తాగితే అజీర్తి, గ్యాస్ వంటివి త‌గ్గుతాయి.

3. త్రిఫ‌ల

ఉసిరికాయ‌, తానికాయ‌, క‌ర‌క్కాయ‌ల‌ను త్రిఫ‌లాలుగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ మూడింటినీ క‌లిపి త‌యారు చేసే త్రిఫ‌ల చూర్ణాన్ని నిత్యం రాత్రిపూట నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1, 2 టీస్పూన్లు క‌లిపి తీసుకోవాలి. దీంతో ఉద‌యాన్నే విరేచ‌నం సాఫీగా అవుతుంది. గ్యాస్‌, అజీర్తి త‌గ్గుతాయి.

4. సోంపు గింజ‌లు

సోంపు గింజ‌ల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. భోజనం చేశాక 1, 2 టీస్పూన్ల సోంపు గింజ‌ల‌ను నమిలి మింగాలి. వీటిని తిన‌డం వ‌ల్ల తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్ ఉండ‌దు. పేగుల్లో ఆహారం క‌ద‌లిక స‌రిగ్గా ఉంటుంది.

4777
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles