వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌ని మ‌జ్జిగ‌తో బోలెడు లాభాలు..!


Wed,April 17, 2019 04:47 PM

ప్ర‌తి ఏడులాగే ఈ వేస‌వి కూడా మండిపోతున్న‌ది. భ‌గ భ‌గలాగే భానుడి మంట‌ల‌కు జ‌నాలు ఠారెత్తిపోతున్నారు. దీంతో మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో బ‌య‌ట‌కు రావాలంటేనే జంకుతున్నారు. ఏ ప‌ని ఉన్నా ఉద‌యమో, సాయంత్ర‌మో బ‌య‌ట‌కు వ‌స్తున్నారు త‌ప్ప మ‌ధ్యాహ్నం కాలు బ‌య‌ట పెట్ట‌డం లేదు. ఈ క్ర‌మంలోనే వేస‌వి తాపం నుంచి సేద‌దీరేందుకు చ‌ల్ల‌ని మార్గాల‌ను కూడా అనుస‌రిస్తున్నారు. అయితే వేస‌విలో శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే అనేక పానీయాల్లో మ‌జ్జిగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మ‌జ్జిగ‌ను వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌గా తాగితే మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!

1. వేస‌విలో చ‌ల్ల చ‌ల్లగా మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఎండ‌కు వెళ్లి వ‌చ్చే వారు ఇంటికి చేరుకోగానే చ‌ల్ల‌ని మ‌జ్జిగ‌లో నిమ్మ‌కాయ పిండుకుని తాగితే ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. వేస‌వి తాపం తీరుతుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తూకంలో ఉంటాయి.

2. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మ‌జ్జిగ‌లో ఉండే బ‌యోయాక్టివ్ సమ్మేళ‌నాలు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్రిస్తాయి. అందువ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

3. కాల్షియం లోపం ఉన్న‌వారు మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కాల్షియం అందుతుంది. త‌ద్వారా ఎముక‌లు, దంతాలు దృఢంగా మారుతాయి.

4. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ త‌గ్గుతాయి. అలాగే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

2851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles