మెంతుల‌తో ఏయే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?


Sun,May 19, 2019 11:45 AM

భార‌తీయులు ఎంతో కాలం నుంచి వాడుతున్న వంట ఇంటి పోపు దినుసుల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతుల‌తో కూర‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. మెంతుల‌ను చాలా మంది ప‌చ్చ‌ళ్ల త‌యారీలో ఉప‌యోగిస్తుంటారు. అయితే మెంతుల‌తో మ‌న‌కు నిజానికి అనేక రకాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒక టీస్పూన్ మెంతి పొడిని ఒక గ్లాస్ నీటిలో క‌లుపుకుని భోజ‌నానికి ముందు తీసుకుంటే గ్యాస్‌, అసిడిటీ, జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. మ‌ధుమేహం నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది.

2. మెంతుల‌ను వాడడం వ‌ల్ల మ‌హిళ‌ల‌కు రుతు స‌మ‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. బాలింత‌ల్లో పాలు ఎక్కువ‌గా ప‌డాలంటే మెంతుల‌ను ఉప‌యోగించాలి.

3. చ‌ర్మ స‌మ‌స్య‌లు, చ‌ర్మంపై వ‌చ్చే ఇన్‌ఫెక్ష‌న్ల‌ను తగ్గించ‌డంలో మెంతులు బాగా ప‌నిచేస్తాయి. అలాగే జ్వ‌రం, గొంతు నొప్పి సమ‌స్య‌ల‌కు కూడా మెంతులు బాగా ప‌నిచేస్తాయి.

4. శ‌రీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగించ‌డంలో, అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ మెంతులు బాగా ప‌నిచేస్తాయి.

5439
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles