చుండ్రును తగ్గించే 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు..!


Thu,December 20, 2018 12:23 PM

అధికమైన వేడి ఉండే వాతావరణంలో ఎక్కువ సేపు గడపడం.. పోషకాహార లోపం.. ఒత్తిడి.. వంటి అనేక కారణాల వల్ల మనలో చాలా మందికి చుండ్రు సమస్య వస్తుంటుంది. చలికాలంలో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగానే ఉంటుంది. అయితే కింద సూచించిన పలు చిట్కాలను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి తేలిగ్గా బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. కొన్ని మందార పువ్వులను తీసుకుని కొబ్బరినూనెలో వేసి బాగా మరిగించాలి. అనంతరం వేడిగా ఉండగానే ఆ పువ్వులను పిండాలి. దీంతో ఆ పువ్వులో ఉండే సారం నూనెలోకి వెళ్తుంది. అనంతరం ఆ నూనెను చల్లార్చి వాడుకోవాలి. దాన్ని నిత్యం జుట్టుకు రాసుకుంటే చుండ్రు తగ్గిపోతుంది.

2. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని గులాబీ రేకులను వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని తలకు రాసుకోవాలి. 30 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు సమస్య త్వరగా తగ్గుతుంది.

3. ఆరు టీస్పూన్ల గోరింటాకు పొడి, ఆరు టీస్పూన్ల మందార ఆకుల పొడి, ఒక టీస్పూన్ యూకలిప్టస్ ఆయిల్, ఒక టీస్పూన్ నిమ్మరసం, కొద్దిగా కొబ్బరిపాలు తీసుకుని మిశ్రమంగా చేయాలి. దాన్ని తలకు పట్టించాలి. 45 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. వారంలో కనీసం ఇలా ఒకటి రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు.

4. నాలుగైదు కప్పుల గోరు వెచ్చని నీటిలో రెండు గుప్పెళ్ల వేపాకులను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆకులను తీసేసి ఆ నీటిని తలకు రాసుకోవాలి. 30 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. వారంలో మూడు సార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే వేపాకులను మెత్తగా నూరి పేస్ట్‌లా చేసి దాన్ని తలకు పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చు్రండు త్వరగా తగ్గుతుంది.

5. యాపిల్ సైడర్ వెనిగర్, నీటిని సమపాళ్లలో తీసుకుని దాన్ని మిశ్రమంగా చేసి ఆ మిశ్రమాన్ని షాంపూకు బదులుగా వాడాలి. యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు తలపై ఉండే ఫంగస్, ఇతర క్రిములను నాశనం చేస్తాయి. దీంతోపాటు చుండ్రు కూడా తగ్గుతుంది.

4697
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles