బరువు వేగంగా తగ్గాలా ? ఈ టిప్స్ పాటించండి..!


Mon,March 5, 2018 02:37 PM

నేటి తరుణంలో అధిక బరువు తగ్గడం అనేది చాలా మందికి ఎంత సమస్యగా మారిందో అందరికీ తెలిసిందే. రాత్రికి రాత్రే బరువు తగ్గడం అనేది కుదరని పని అని కూడా అందరికీ తెలుసు. ఈ క్రమంలో బరువును తగ్గించుకునేందుకు అందరూ నానా అవస్థలు పడుతున్నారు. నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి పనులు చేస్తున్నారు. అయితే ఇవే కాకుండా కింద ఇచ్చిన పలు టిప్స్‌ను పాటిస్తే దాంతో అధిక బరువును వేగంగా తగ్గించుకునేందుకు వీలుంటుంది. మరి ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. బ్రేక్‌ఫాస్ట్


బరువు తగ్గవచ్చని చెప్పి చాలా మంది ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్‌ను మానేస్తుంటారు. కానీ ఇలా చేయరాదు. ఎందుకంటే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయడం వల్ల రోజులో మిగిలిన సమయంలో మరింత ఎక్కువ ఫుడ్‌ను లాగించేస్తారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను ఎట్టి పరిస్థితిలోనూ మానేయరాదు. కాకపోతే అందులో కార్బొహైడ్రేట్స్ కాకుండా, ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మంచిది. దీంతో అధిక బరువు వేగంగా తగ్గవచ్చు.

2. గోరు వెచ్చని నీళ్లు


ఉదయం నిద్ర లేవగానే 2 నుంచి 4 గ్లాసుల వరకు గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇది శరీర మెటబాలిజంను పెంచుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అలాగే మలబద్దకం, గ్యాస్ సమస్యలు పోతాయి. గోరు వెచ్చని నీటిలో వీలుంటే నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు. దీంతో శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. లివర్ క్లీన్ అవుతుంది.

3. ప్రోటీన్లు


ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా చేసే భోజనంలో కచ్చితంగా ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల తక్కువ ఆహారం తింటారు. అంత త్వరగా కూడా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.

4. కార్బొహైడ్రేట్లు, చక్కెర


రిఫైన్ చేసిన పిండిపదార్థాలు (కార్బొహైడ్రేట్లు), చక్కెర సంబంధ పదార్థాలను తినరాదు. తింటే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది బరువు తగ్గేందుకు ఆటంకం అవుతుంది. కనుక ఫైబర్, ప్రోటీన్లు, ఫ్యాట్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బరువు తగ్గేందుకు ఇది సహాయపడుతుంది.

5. నిద్ర


రోజూ కచ్చితంగా 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. దీంతో ఆకలి, బరువు తగ్గించే హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. లేదంటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. అది డయాబెటిస్‌కు కూడా దారి తీయవచ్చు. కనుక ఎవరైనా రోజూ తగినంత సమయం పాటు నిద్రపోతే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గేందుకు అది దోహదపడుతుంది.

10454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles