రొయ్య‌ల‌ను తింటే.. ఎన్ని లాభాలో..!

Sun,April 28, 2019 10:16 AM

మ‌న‌కు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న అనేక నాన్‌వెజ్ ఆహారాల్లో రొయ్య‌లు చాలా ముఖ్య‌మైన‌వి. వీటిలో ప‌చ్చి రొయ్య‌లు, ఎండు రొయ్య‌లు అని రెండు ర‌కాలు ఉంటాయి. అయితే ఏ రొయ్య‌ల‌ను తిన్నా స‌రే.. మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు రొయ్య‌ల్లో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే రొయ్య‌ల‌ను త‌ర‌చూ తింటుంటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


1. రొయ్య‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి గుండె జ‌బ్బులు రాకుండా చూస్తాయి. అధిక బ‌రువును త‌గ్గిస్తాయి.

2. రొయ్య‌ల్లో ఉండే ప్రోటీన్ మ‌న శ‌రీరంలో కండ‌రాల నిర్మాణానికి, కొత్త క‌ణ‌జాలం ఏర్పాటు అయ్యేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

3. హార్మోన్ల స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రొయ్య‌ల‌ను త‌ర‌చూ తింటుంటే శ‌రీరంలో జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌ర్తింప‌బ‌డ‌తాయి. ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

4. రొయ్య‌ల్లో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది. అందువ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారు రొయ్య‌ల‌ను తింటుంటే శ‌రీరంలో ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.

5. రొయ్య‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే జింక్‌, సెలీనియం, కాప‌ర్‌, మెగ్నిషియం త‌దిత‌ర పోష‌కాలు పుష్క‌లంగా ఉన్నందువ‌ల్ల వాటిని తింటే మ‌న శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది.

6353
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles