గ్యాస్ ట్ర‌బుల్‌ను త‌గ్గించే 5 అద్భుత‌మైన చిట్కాలు..!


Tue,December 4, 2018 10:34 AM

భోజ‌నం స‌రిగ్గా చేయ‌క‌పోయినా, టైముకు తిన‌క‌పోయినా, ఎక్కువ‌గా తిన్నా, తిన్న ఆహారం జీర్ణం కాక‌పోయినా... ఇలా అనేక మందికి అనేక ర‌కాలుగా గ్యాస్ ట్రబుల్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. అందుకు వారికి ఏం చేయాలో అర్థం కాదు. దీంతో ఎప్పుడూ గ్యాస్ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతుంటారు. అలాంటి వారు గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు కొన్ని చిట్కాల‌ను పాటించాలి. అవేమిటంటే...

1. ప్రతిరోజూ ఇంగువను చూర్ణంగా చేసుకుని అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో అది కలుపుని తింటే గ్యాస్ సమస్యను అధిగమించవచ్చు.

2. పరగడుపుతో కరివేపాకు ఆకులను తిన్నా కూడా చక్కని ఫలితం ఉంటుంది. దాంతో జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి.

3. నిత్యం ఆహారంలో మజ్జిగ‌ను తీసుకుంటే గ్యాస్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

4. రోజూ రాత్రి పూట అర టీస్పూన్ మోతాదులో జీల‌కర్ర లేదా వాము తీసుకుని దాన్ని అలాగే తినాలి. అనంత‌రం నీళ్లు తాగాలి. ఇలా రోజూ చేస్తే గ్యాస్ స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా విముక్తి పొంద‌వ‌చ్చు.

5. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే అల్లం ర‌సం సేవించాలి. జీర్ణ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే శ‌క్తి అల్లానికి ఉంది.

4883
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles