దాల్చిన చెక్క‌తో ఎలాంటి అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?


Mon,November 26, 2018 07:57 PM

దాల్చిన చెక్క‌ను మ‌నం త‌ర‌చూ ప‌లు వంట‌ల్లో వేస్తుంటాం. దాల్చిన చెక్క వ‌ల్ల వంట‌ల‌కు చక్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే దాల్చిన చెక్కను కేవ‌లం ఇందు కోస‌మే కాక దాంతో మ‌నం ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకునేందుకు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. దాల్చిన చెక్క వ‌ల్ల ఎలాంటి అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. దాల్చిన చెక్కను నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరి నుదురుకు కట్టులాగా వేస్తే జలుబు వల్ల వచ్చే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఒక కప్పు నీటిలో మూడు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనె కలిపి రోజుకు మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది.

2. దాల్చిన చెక్క నూనె చెవిలో వేసుకుంటే వినికిడి శక్తి పెరుగుతుంది. అలాగే చిటికెడు దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలిపి రాత్రిపూట పడుకునే ముందు సేవిస్తే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందని ఆయుర్వేదం చెబుతోంది.

3. గుండె పట్టేసినట్లుగా అనిపిస్తుంటే దాల్చిన చెక్క చూర్ణం, యాలకుల పొడి సమపాళ్ళలో నీటిలో కలుపుకుని కషాయంలాగా కాచి తాగితే గుండె బిగపట్టడం తగ్గుతుంది. అలాగే దాల్చిన చెక్క కషాయం తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి.

4. కాస్తంత తేనెను వేడిచేసి అందులో ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని కలిపి రోజుకు మూడు పూటలా తీసుకున్నా లేదా ఇదే మిశ్రమాన్ని శరీరానికి పూసినా దురదలు, ఎగ్జిమా, పొక్కులు లాంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులను అరికట్టవచ్చు.

5. బియ్యం కడిగిన నీటిలో మూడు గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే మహిళలను వేధించే అధిక రుతుస్రావం బారి నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

8442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles