రోజూ 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే ఇన్ని లాభాలా..!


Sun,January 27, 2019 09:01 AM

ఇప్పుడంటే ఇంట్లో నుంచి కాలు బ‌య‌ట పెడితే టూ వీల‌ర్ లేదా కారు తీసి అందులో ప్ర‌యాణిస్తున్నారు. చిన్న దూర‌మైనా వాహ‌నాల వాడ‌కం త‌ప్ప‌నిస‌రి అయింది. కానీ ఒక‌ప్పుడు ఎక్కువ‌గా సైకిళ్ల‌ను వాడేవారు. అస‌లు ఈ ఆధునిక యుగంలో సైకిల్ తొక్కేవారు త‌క్కువ‌వ‌తున్నారు. స్కూల్‌కు వెళ్లే పిల్ల‌లు త‌ప్ప ఇప్పుడు సైకిల్ తొక్కేవారు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. కానీ నిత్యం వ్యాయామం చేయ‌లేమ‌ని అనుకునేవారు క‌నీసం 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కినా చాలు. దాంతో అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. సైకిల్ తొక్క‌డం వ‌ల్ల శ‌రీరం మొత్తానికి వ్యాయామం అవుతుంది. దీంతో దాదాపుగా అన్ని భాగాల్లో ఉండే కొవ్వు క‌రుగుతుంది. శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

2. డ‌యాబెటిస్ ఉన్న‌వారు సైక్లింగ్ చేస్తే ఎంతో మంచిది. షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. నిత్యం 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే 60 శాతం వ‌ర‌కు మ‌ధుమేహం త‌గ్గే అవ‌కాశాలు ఉంటాయ‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. అలాగే హైబీపీ ఉన్న వారు సైక్లింగ్ చేస్తే బీపీ త‌గ్గుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగుప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు.

3. సైకిల్ తొక్కుతున్న‌ప్పుడు కొన్ని సంద‌ర్భాల్లో శ్వాస తీసుకోడం, వ‌ద‌ల‌డం వేగంగా చేస్తారు క‌నుక శ‌రీరంలో ఉండే వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

4. కీళ్ల నొప్పులు ఉన్న‌వారు సైక్లింగ్ అలవాటు చేసుకుంటే ఆ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. ఆరంభంలో కొంత క‌ష్టంగా ఉన్న‌ప్ప‌టికీ నెమ్మ‌దిగా ప్ర‌య‌త్నిస్తే కీళ్ల నొప్పుల స‌మ‌స్య నుంచి శాశ్వ‌తంగా ప‌రిష్కారం పొంద‌వ‌చ్చు.

5. ప‌చ్చ‌ని ఆహ్లాద‌క‌రమైన వాతావ‌ర‌ణంలో నిత్యం సైక్లింగ్ చేస్తే మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. డిప్రెష‌న్‌, ఒత్తిడి త‌గ్గుతాయ‌ని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. అలాగే మెదడు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. మ‌తి మ‌రుపు త‌గ్గుతుంద‌ని వారు అంటున్నారు.

10503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles