వేస‌విలో కీర‌దోస ఇచ్చే ఉప‌యోగాల‌ను మ‌రువ‌కండి..!


Thu,April 18, 2019 03:18 PM

ఎండాకాలంలో మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే ఆహార ప‌దార్థాల్లో కీర దోస కూడా ఒక‌టి. కీరదోస మ‌న‌కు ఈ సీజ‌న్‌లో బాగా దొరుకుతుంది. కీర‌దోసకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా వేస‌విలో అయితే కీర‌దోస‌ను నిత్యం తీసుకోవాలి. దాంతో అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటంటే...

1. కీర‌దోసకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. ఎండ దెబ్బ త‌గ‌ల‌కుండా ఉంటుంది.

2. వేస‌విలో ప‌లు వేడి చేసే ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల కొంద‌రికి విరేచ‌నాలు అవుతుంటాయి. అలాంటి వారు ఆ పదార్థాల‌ను తిన్న‌ప్పుడు కీర‌దోస తింటే శ‌రీరం వేడి కాకుండా ఉంటుంది. దీంతో విరేచ‌నాలు కాకుండా ముందుగానే నిరోధించ‌వ‌చ్చు.

3. శ‌రీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న‌వారు, డ‌యాబెటిస్ ఉన్న‌వారు కీర‌దోస‌ను తింటే ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

4. అధిక బ‌రువు ఉన్న వారు నిత్యం కీర‌దోస తింటే బ‌రువు త‌గ్గుతార‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి.

5. కీర‌దోసను అడ్డంగా చ‌క్రాల మాదిరిగా క‌ట్ చేసి క‌ళ్ల సేపు 20 నిమిషాల పాటు ఉంచుకుంటే క‌ళ్ల‌కు మేలు క‌లుగుతుంది. ఎండ‌కు వెళ్లి వ‌చ్చే వారు క‌ళ్ల‌పై కీర‌దోస ముక్క‌ల‌ను ఉంచుకుంటే క‌ళ్లపై ఒత్తిడి ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు.

2111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles