హేజల్‌నట్స్ తింటే కలిగే అద్భుతమైన లాభాలివే..!


Sun,June 2, 2019 05:55 PM

వాల్‌నట్స్, బాదంపప్పు, పిస్తా.. తదితర నట్స్‌లాగే మనకు మార్కెట్‌లో హేజల్‌నట్స్ కూడా దొరుకుతాయి. చాలా మందికి వీటి గురించి తెలియదు. నిజానికి ఈ నట్స్ కూడా మనకు ఉపయోగకరమే. వీటిలో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. అలాగే ఈ నట్స్‌ను తరచూ తినడం వల్ల పలు అనారోగ్య సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. మరి హేజల్‌నట్స్‌ను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. డయాబెటిస్ ఉన్నవారికి హేజల్‌నట్స్ ఎంతో మేలు చేస్తాయి. వీటిని నిత్యం తింటే షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నిత్యం ఒక గుప్పెడు హేజల్‌నట్స్ తింటే షుగర్ అదుపులో ఉంటుంది.

2. హేజల్‌నట్స్‌ను నిత్యం 4 వారాల పాటు తీసుకుంటే శరీరంలో ఆయా భాగాల్లో ఉండే నొప్పులు తగ్గిపోతాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.

3. హేజల్‌నట్స్‌ను తినడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా ఉంటాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్స్ రాకుండా చూసుకోవచ్చు.

4. థైరాయిడ్ సమస్య ఉన్నవారు హేజల్‌నట్స్‌ను తినాలి. వీటిల్లో ఉండే మాంగనీస్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుస్తుంది. థైరాయిడ్‌ను సరిగ్గా పనిచేయిస్తుంది. దీంతో థైరాయిడ్ వ్యాధులు తగ్గుతాయి. శరీర మెటబాలిజం కూడా సరిగ్గా ఉంటుంది.

5. హేజల్‌నట్స్‌లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే వాటిల్లో ఉండే ప్రొ ఆంథోసయనిడిన్స్ పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.

4026
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles