పియర్స్ పండ్లను తరచూ తింటే హార్ట్ ఎటాక్స్ రావట..!

Sun,June 9, 2019 07:18 PM

మార్కెట్‌లో మనకు దొరికే అనేక రకాల పండ్లలో పియర్స్ పండ్లు కూడా ఒకటి. ఇవి మన శరీరానికి అనేక ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే పియర్స్ పండ్లను తరచూ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


1. పియర్స్ పండ్లను రెగ్యులర్‌గా తింటే హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాని పలువురు డచ్ సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. పియర్స్ పండ్లను తరచూ తినడం వల్ల స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు 52 శాతం వరకు తక్కువగా ఉంటాయట.

2. ఒక కప్పు పియర్స్ పండ్లలో 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మన శరీరానికి నిత్యం కావల్సిన మోతాదులో 20 శాతం. అందువల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే మంచి బాక్టీరియా మరింత వృద్ధి చెందుతుంది. అలాగే చెడు బాక్టీరియా నశిస్తుంది.

3. పెద్ద పేగు ఆరోగ్యంగా ఉండాలన్నా.. దానికి ఎలాంటి వాపు రాకుండా ఉండాలన్నా.. నిత్యం సుఖ విరేచనం అవ్వాలన్నా.. పియర్స్ పండ్లను తినాలి. ఈ పండ్ల వల్ల పెద్ద పేగులో మలం కదలిక సులభంగా ఉంటుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది.

4. పియర్స్ పండ్లను తినడం వల్ల అధిక బరువు తగ్గవచచని, గుండె జబ్బులు, డయాబెటిస్ రాకుండా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

5. రక్తహీనత సమస్య ఉన్నవారు, పుట్టుకతో లోపాలు ఉన్నవారు, ఎముకలు, దంతాలు సమస్యలు కలిగిన వారు పియర్స్ పండ్లను తింటుంటే ఆయా అనారోగ్య సమస్యల నుంచి నెమ్మదిగా బయట పడవచ్చు. అలాగే పియర్స్ పండ్లను తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా రాకుండా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.

7190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles