మ‌ల‌బ‌ద్దకం త‌గ్గాలంటే..?


Thu,April 18, 2019 05:55 PM

థైరాయిడ్ సమస్యలు, స్థూలకాయం, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడం, చాలా సేపు కూర్చుని పనిచేయడం, కొన్ని రకాల మెడిసిన్ల వల్ల మనలో చాలా మందికి అప్పుడప్పుడు మలబద్దక సమస్య వస్తుంటుంది. దీంతో గంటల తరబడి టాయిలెట్‌లో కూర్చున్నా విరేచనం సాఫీగా అవదు. ఇలా అవడం వల్ల మనకు రోజంతా కడుపులో అసౌకర్యంగానే ఉంటుంది. అయితే కింద ఇచ్చిన పలు చిట్కాలు పాటిస్తే మలబద్దక సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపి తాగితే చాలు వెంటనే విరేచనం అవుతుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు నెట్టి వేయబడతాయి. నెయ్యికి బదులుగా కొబ్బరినూనెను కూడా వాడవచ్చు. రోజూ ఇలా చేస్తే మలబద్దకం ఎన్నటికీ బాధించదు.

2. రోజూ పరగడుపునే ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్‌ను తీసుకుంటే మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. విరేచనం సాఫీగా అవుతుంది.

3. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి ఆ నీటిని తాగితే విరేచనం అవుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది.

4. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను కలుపుకుని తాగినా ఫలితం ఉంటుంది.

5. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఎప్సం సాల్ట్‌ను కలుపుకుని తాగినా మలబద్దకం నుంచి తప్పించుకోవచ్చు. ఎప్సం సాల్ట్‌లో ఉండే మెగ్నిషియం పేగుల్లో కదలికలను నియంత్రిస్తుంది. దీంతో విరేచనం సులువుగా అవుతుంది.

5403
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles