ఈ 6 టిప్స్ పాటిస్తే.. అధిక కొవ్వు, బ‌రువు మాయం..!


Thu,January 25, 2018 08:39 AM

ఉరుకుల, పరుగుల బిజీ జీవితం, ఒత్తిడి, నిద్రలేమి, వేళ పాటించకుండా తినడం... ఇలా చెప్పుకుంటూ పోతే కారణాలు ఏమున్నా నేడు అధిక బరువుతో మనలో అధిక శాతం మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడమే. అయితే దీన్ని తగ్గించుకునేందుకు కింద పేర్కొన్న పలు సులభమైన చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. ఇందు కోసం ఎక్క‌డికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇండ్లలో ఉండే వివిధ రకాల పదార్థాలనే కొవ్వు కరిగించే ఔషధాలుగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాత బియ్యంతో కాచిన పలుచని జావను నిత్యం రెండు పూటలా రెండు గ్లాసుల మోతాదులో తాగాలి. దీన్ని వండే సమయంలో అందులో వాము పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి ఒక్కొక్కటి మూడు చిటికెలు మోతాదుగా వేయాలి. చిన్న అల్లం ముక్క, తగినంత సైంధవ లవణం, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి వండాలి. అనంత‌రం దాన్ని తాగాల్సి ఉంటుంది. ఇలా చేస్తే కొవ్వు త్వ‌ర‌గా క‌రిగిపోయి అధిక బ‌రువు త‌గ్గుతారు.

2. కూరగాయలతో వండిన సూప్‌ను ఒక పూట ఆహారంగా తీసుకోవచ్చు. దీంతో చాలా వ‌రకు క్యాల‌రీల చేర‌కుండా చూడ‌వ‌చ్చు. ఫ‌లితంగా అధిక బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది.

3. ఉత్తరేణి తైలం లేదా ఆవాల నూనెను గోరువెచ్చగా చేసి స్నానానికి గంట ముందు కొవ్వు పెరిగిన భాగాలపై ఇంకేలా మ‌సాజ్ చేయాలి. అనంత‌రం స్నానం చేయాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే కొవ్వు త్వ‌ర‌గా కరిగిపోతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

4. బార్లీ పిండి, గోధుమ పిండి రెండూ కలిపి చేసిన రొట్టెలను తీసుకున్నా మెరుగైన ఫలితాలు వస్తాయి. కొవ్వు త్వ‌ర‌గా క‌రుగుతుంది.

5. ఉదయాన్నే పరగడుపున 20 గ్రాముల కలబంద గుజ్జు, 3 గ్రాముల కరక్కాయల పొడి, 3 గ్రాముల పసుపు, అరకప్పు నీరు కలిపి బాగా గిలకొట్టి తాగాలి.

6. గుప్పెడు నల్ల ఉలవలను రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయం గుగ్గిళ్ల లాగా వండి తింటే మెరుగైన ఫలితం కనిపిస్తుంది. అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గ‌వ‌చ్చు.

6732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles