ఈ 6 సూచనలు పాటిస్తే.. నిద్రలేమికి చెక్ పెట్టవచ్చు..!


Thu,November 22, 2018 12:46 PM

నేటి తరుణంలో అధిక శాతం మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో నిద్రలేమి సమస్య కూడా ఒకటి. ఇందుకు అనేక కారణాలుంటున్నాయి. నిత్యం వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు తదితర అనేక అంశాల వల్ల చాలా మంది నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు. అయితే ముఖ్యంగా మహిళలు ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతున్నట్లు కూడా తెలిసింది. సైంటిస్టులు చేసిన పరిశోధనలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిద్రలేమి సమస్య నుంచి దూరం అవ్వాలంటే అందుకు కింద తెలిపిన పలు చిట్కాలు పాటించాలి.

1. రాత్రి పూట భోజనం చేశాక కొంతసేపు వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. చక్కగా నిద్ర కూడా పడుతుంది.

2. నిద్రపోయే ముందు టీ, కాఫీ వంటివి తాగరాదు. అందుకు బదులుగా పాలు తాగవచ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ తేనె కలుపుకుని తాగి 30 నిమిషాలు ఆగాక నిద్రిస్తే చక్కని నిద్ర పడుతుంది.

3. నిత్యం ఒకే సమయానికి నిద్రించాలి. ఒకే సమయంలో నిద్ర లేవాలి. ఇలా చేయడం వల్ల జీవనశైలి సరిగ్గా ఉంటుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.

4. బెడ్‌రూంలో సువాసన వచ్చే అగర్‌బత్తీలు లేదా క్యాండిల్స్ వెలిగించాలి. లేదంటే వాసన వెదజల్లే పువ్వులను ఫ్లవర్ వేజ్‌లలో పెట్టుకోవచ్చు. దీంతో గదిలో ఉన్న గాలి స్వచ్ఛంగా మారి మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. ఆ సువాసనల్లో మైమరచిపోతూ సులభంగా నిద్రపోవచ్చు.

5. తక్కువ సౌండ్‌తో మీకు నచ్చిన ఆహ్లాదకరమైన సంగీతం వినండి. లేదా పుస్తకం చదవండి. నిద్రించడానికి కనీసం 30 నిమిషాల ముందే ఫోన్, కంప్యూటర్, టీవీ వంటి వాటికి దూరంగా ఉండండి.

6. రాత్రి పూట భోజనానికి, నిద్రకు కనీసం 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. అప్పుడు తేలిగ్గా నిద్ర పడుతుంది.

2932
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles