కిడ్నీ స్టోన్ల‌ను త్వ‌ర‌గా క‌రిగించేందుకు ఇంటి చిట్కాలు..!


Sat,February 23, 2019 05:05 PM

నేటి త‌రుణంలో ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది కిడ్నీ స్టోన్ల బారిన ప‌డుతున్నారు. అందుకు కార‌ణాలు అనేక ఉంటున్నాయి. కిడ్నీ స్టోన్లు ఉంటే మూత్రం పోసే స‌మ‌యంలో నొప్పి, మంట‌, వికారం, జ్వ‌రం, పొట్ట కింది భాగంలో నొప్పి ఉండ‌డం, మూత్రం రంగు మార‌డం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి రావ‌డం, మూత్రం తక్కువ‌గా రావ‌డం, మూత్రం దుర్వాస‌న‌గా ఉండ‌డం.. వంటి అనేక ల‌క్షణాలు క‌నిపిస్తాయి. అయితే కిడ్నీ స్టోన్లు ఉన్న వారు డాక్ట‌ర్ ఇచ్చే చికిత్సకు తోడు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే.. వాటిని త్వ‌ర‌గా క‌రిగించుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. కిడ్నీ స్టోన్లు రాకుండా చూడ‌డంలో యాపిల్స్ మెరుగ్గా ప‌నిచేస్తాయి. నిత్యం ఒక యాపిల్ పండును తింటుంటే కిడ్నీ స్టోన్లు రావు. అలాగే ఉన్న స్టోన్లు కూడా కరిగిపోతాయి.

2. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తుల‌సి ఆకుల ర‌సంలో తేనె క‌లుపుకుని 6 నెల‌ల పాటు తాగితే ఎలాంటి కిడ్నీ స్టోన్ అయినా క‌రిగిపోతుంది.

3. కిడ్నీ స్టోన్ల స‌మ‌స్య ఉన్న‌వారు ద్రాక్ష‌ల‌ను త‌ర‌చూ తింటుంటే ఫ‌లితం ఉంటుంది.

4. పుచ్చ‌కాయ‌ల‌ను త‌ర‌చూ తినడం వ‌ల్ల కిడ్నీ స్టోన్లు క‌రిగిపోతాయి.

5. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ వేసి నిత్యం ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి ముందు సేవించాలి. దీంతో కిడ్నీ స్టోన్లు త్వ‌ర‌గా కరిగిపోతాయి.

6. విట‌మిన్ బి6 ఉన్న సోయాబీన్‌, బ్రౌన్ రైస్‌, కోడిగుడ్లు.. త‌దిత‌ర ఆహారాల‌ను నిత్యం తింటుంటే కిడ్నీ స్టోన్లు క‌రిగిపోతాయి. లేదా నిత్యం 100 లేదా 150 ఎంజీ మోతాదులో విట‌మిన్ బి6 ట్యాబ్లెట్ల‌ను కూడా వాడ‌వ‌చ్చు. కానీ వాటిని వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మాత్ర‌మే వాడుకోవాలి.

9136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles