ఎగ్స్ తినే వారు ఈ విష‌యాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి..!

Mon,April 10, 2017 07:34 PM

కోడిగుడ్లలో ఎంతటి పౌష్టికాహారం ఉంటుందో అందరికీ తెలిసిందే. వాటిలో మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు లభిస్తాయి. శాచురేటెడ్ ఫ్యాట్లు, సోడియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ ఎ, కాల్షియం, విటమిన్ డి, బి 12 వంటి పోషకాలు గుడ్లలో ఉంటాయి. రోజూ కోడిగుడ్లను తింటుంటే మన శరీరానికి కావల్సిన సంపూర్ణ పోషకాహారం లభిస్తుందనడంలో అతిశయోక్తి కూడా లేదు. అయితే కోడిగుడ్లను తినే వారు మాత్రం కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. అవేమిటంటే...


1. బాగా ఉడకబెట్టిన కోడిగుడ్లను పైన పొట్టుతో అలాగే గుండ్రంగా తిప్పితే తిరుగుతాయి. కానీ పచ్చి కోడిగుడ్లు మాత్రం అలా తిరగవు.

2. తల్లిపాల తరువాత అంతటి పౌష్టికాహారం కలిగినవి కేవలం కోడిగుడ్లేనని ఇటీవల జరిపిన పరిశోధనలు వెల్లడించాయి.

3. కోడిగుడ్లను ఉడకబెడుతున్నా లేదంటే వాటిని ఫ్రిజ్‌లో స్టోర్ చేయాలని చూసినా వాటిని బాగా కడగాలి. ఎందుకంటే వాటిపై మన కంటికి కనిపించని బాక్టీరియా, దుమ్ము ఉంటుంది. అది మన శరీరంలోకి వెళ్తే అనారోగ్యం కలుగుతుంది.

4. కోడిగుడ్డు పచ్చని సొనను బట్టి దాన్ని పెట్టిన కోడి ఎలాంటి ఆహారం తిన్నదో ఇట్టే చెప్పవచ్చు. అది ఎలా అంటే గుడ్డు పచ్చని సొన బాగా డార్క్ కలర్‌లో ఉంటే అప్పుడా గుడ్డు పెట్టిన కోడి ఆకుపచ్చని ఆహారం తిన్నట్టు లెక్క. అలా కాకుండా పచ్చ సొన సాధారణ పసుపు రంగులో, లైట్ కలర్‌లో ఉంటే అప్పుడా గుడ్డును పెట్టిన కోడి మొక్క జొన్నలు లేదా అల్ఫాల్ఫా వంటి ఆహారం తిన్నట్టు తెలుసుకోవాలి.

5. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే కోడిగుడ్లు ఎక్కువ కాలం ఉంటాయి. దీంతోపాటు ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల కోడిగుడ్డు పొట్టు గట్టి పడుతుంది. దీని వల్ల బాక్టీరియా గుడ్డు లోపలికి అంత తేలిగ్గా ప్రవేశించలేదు.

6. ఓ సాధారణ కోడిగుడ్డు ద్వారా మనకు 70 క్యాలరీల శక్తి లభిస్తుంది. అందులో 5 గ్రాముల కొవ్వు ఉంటుంది.

8682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles