రోజూ అవిసెగింజ‌ల‌ను తింటే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!


Sat,July 7, 2018 02:30 PM

భార‌తీయులు అవిసె గింజ‌ల‌ను ఎంతో పురాత‌న కాలం నుంచి త‌మ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇప్పుడంటే చాలా మంది వీటిని తిన‌డం త‌గ్గించేశారు. కానీ నిజానికి అవిసె గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు తెలిస్తే వాటిని ఎవరూ విడిచిపెట్ట‌రు. ఈ గింజ‌ల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విట‌మిన్ బి1, కాప‌ర్‌, మాంగ‌నీస్‌, మెగ్నిషియం, పాస్ఫ‌ర‌స్‌, జింక్‌, సెలీనియం వంటి పోష‌కాలు అవిసె గింజ‌ల్లో పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ‌ను అందిస్తాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. నిత్యం అవిసె గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. చేప‌లు తిన‌లేని వారికి అవిసె గింజ‌ల‌ను మంచి ఆహారంగా చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే చేప‌ల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అవిసె గింజ‌ల్లో పుష్క‌లంగా ఉంటాయి. ఇవి జీర్ణ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి. అవిసె గింజ‌ల పొడిని గోధుమ పిండి, ఇడ్లీ, దోశ పిండిల‌లో క‌లుపుకుని కూడా వాడుకోవ‌చ్చు.

2. అవిసె గింజ‌లలో కొలెస్ట్రాల్‌ తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో వేడిని పుట్టిస్తాయి. ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి. వీటిని ప్రతి రోజు ఉదయం పూట తీసుకుంటే అలసట త‌గ్గుతుంది. శ‌క్తి ల‌భిస్తుంది. ఏ ప‌ని చేసినా ఉత్సాహంగా ఉంటారు. నీర‌సం ఉండ‌దు.

3. మ‌హిళలు రోజూ అవిసె గింజ‌ల‌ను తింటే వారిలో హార్మోన్లు స‌రిగ్గా విడుద‌ల అవుతాయి. దీంతో రుతు క్ర‌మం స‌రిగ్గా ఉంటుంది.

4. అవిసె గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మం సంర‌క్షింప‌బ‌డుతుంది. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది.

5. అవిసె గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

6. రోజూ అవిసె గింజ‌ల‌ను తినడం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. డిప్రెష‌న్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది.

7. త‌ల‌నొప్పి, కీళ్ల నొప్పుల‌కు అవిసె గింజలు బాగా ప‌నిచేస్తాయి. వీటిని తీసుకుంటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

5149
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles