జ‌లుబును త్వ‌ర‌గా త‌గ్గించే ఇంటి చిట్కాలు..!


Sat,November 24, 2018 02:44 PM

ప్ర‌తి ఏటా వ‌చ్చినట్లే ఈ సారి కూడా చ‌లికాలం వ‌చ్చేసింది. ఓ వైపు చ‌లి విజృంభిస్తుంటే మ‌రో వైపు చాలా మంది శ్వాస కోశ వ్యాధులు, స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈ చలికాలంలో ప్రధానంగా జలుబు సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు. ఈ క్ర‌మంలోనే ఆ జ‌లుబును త‌గ్గించుకునేందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడుతుంటారు. కానీ ఇంగ్లిష్ మెడిసిన్‌తో ప‌నిలేకుండా మ‌న‌ ఇంట్లోనే దొరికే స‌హ‌జ సిద్ధ ప‌దార్థాల‌తోనే జలుబును సుల‌భంగా తగ్గించుకోవచ్చు. మ‌రి జ‌లుబు త‌గ్గేందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. జలుబును తగ్గించడంలో తులసి చాలా బాగా పనిచేస్తుంది. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాతి ఉప్పును కలపాలి. ఈ మిశ్ర‌మాన్ని నమిలి మింగాలి. తులసి టీ తాగినా కూడా జలుబును తగ్గించుకోవచ్చు.

2. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో చిటికెడు ప‌సుపు క‌లుపుకుని తాగితే జ‌లుబు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. రాత్రి పూట తాగితే ఇంకా మంచిది.

3. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, ఒక దాల్చిన‌ చెక్క వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడగట్టి దానికి కొద్దిగా తేనేను కలిపి తాగితే మంచిది.

4. ప్రతి రోజు నీటిని బాగా మరగబెట్టి చల్లార్చి తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

5. పాలలో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలిపి ఉడకబెట్టాలి. అనంత‌రం నీరు సగానికి వచ్చాక‌ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ మిశ్ర‌మాన్ని సేవించాలి. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

6. న‌ల్ల మిరియాల‌ను నెయ్యిలో వేయించుకుని తినాలి. అనంతరం ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాలను తాగాలి. దీంతో శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జ‌లుబు త‌గ్గుతుంది.

7. తమలపాకు రసంలో లవంగాల పొడి, అల్లం రసం, తేనె క‌లిపి తీసుకుంటే జ‌లుబు త‌గ్గుతుంది.

6753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles