చ‌ర్మ‌స‌మ‌స్య‌ల‌కు అద్భుత‌మైన నివార‌ణా మార్గాలు..!

Thu,December 27, 2018 11:19 AM

సాధార‌ణంగా మ‌న‌కు శరీరంలో ఇత‌ర ఏ భాగంలో అయినా అనారోగ్య స‌మ‌స్య ఏర్పడితే మందుల‌ను వాడితే కొంత కాలానికి త‌గ్గుతాయి. కానీ చ‌ర్మ స‌మ‌స్య‌లు అలా కాదు. త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ తిర‌గ‌బెడతాయి. ఈ క్ర‌మంలోనే చ‌ర్మ వ్యాధులు వ‌చ్చిన‌ప్పుడు జాగ్ర‌త్త పాటించాలి. దీంతోపాటు కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే వాటిని మ‌ళ్లీ రాకుండా చూసుకోవ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే...

1. మినుములు చర్మానికి మంచి ఔషధంగా ప‌నిచేస్తాయి. వీటిని నానబెట్టి, రుబ్బిన పేస్ట్‌ను శరీరానికి పట్టిస్తుంటే క్రమంగా తెల్లబొల్లి మచ్చలు త‌గ్గిపోతాయి. అలాగే చర్మం కాంతివంతంగా, మృదువుగా మారి ఇత‌ర మ‌చ్చ‌లు కూడా త‌గ్గుతాయి.

2. తులసి ఆకు మ‌న శ‌రీరానికి సహజ సిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. తులసి ఆకు రసంలో హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి శోభిమచ్చలపై రుద్ది ఆరిన తరువాత స్నానం చేస్తుంటే శోభి త్వరగా తగ్గుతుంది.

3. తులసి ఆకుల ర‌సం, నిమ్మరసం కలిపి నూరి పట్టిస్తుంటే గజ్జి, తామర, దురద, దద్దుర్లు త్వరగా త‌గ్గిపోతాయి.

4. తెల్ల గన్నేరు ఆకులు నూరి తెల్ల మచ్చల మీద లేపనం చేయాలి. దీంతో అతి త్వరగా ఆ మచ్చలు త‌గ్గిపోతాయి.

5. జిల్లేడు పాలు, ఆముదం సమంగా కలిపి రుద్దుతూ వుంటే కాలి ఆనెలు హరించుకుపోతాయి.

6. వామును నిప్పులపై వేసి ఆ పొగను ఒంటికి తగిలేట్టు చేస్తే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. పసుపు మూడు గ్రాములు, ఉసిరిక పొడి ఆరు గ్రాములు కలిపి మంచినీటితో సేవిస్తుంటే రక్తశుద్ధి జ‌రుగుతుంది. దీంతోపాటు చ‌ర్మంలో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోయి చ‌ర్మ‌శుద్ధి జ‌రుగుతుంది.

7. మారేడు ఆకు ముద్దగా నూరి క‌ట్టులా కడితే శరీరంలో ఎక్క‌డైనా ఇరుక్కున్న ముళ్లు, మేకులు బయటకొస్తాయి.

3618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles