మనం రోజూ తింటున్న విష పదార్థం ఇది.. మీకు తెలుసా..?


Thu,June 14, 2018 10:17 AM

అవును, మీరు విన్నది నిజమే. మనం ఈ విష పదార్థాన్ని రోజూ తింటున్నాం. కానీ అది విష పదార్థమని మనలో చాలా మందికి తెలియదు. అదే మోనో సోడియం గ్లూటమేట్ (ఎంఎస్‌జీ). దీన్నే సోడియం గ్లూటమేట్ అని, టేస్టింగ్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. ఈ సాల్ట్‌ను ప్రధానంగా హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలలో మనం తినే ఆయా ఆహార పదార్థాల్లో వేస్తుంటారు. దీని వల్ల ఆయా పదార్థాలకు చక్కని రుచి వస్తుంది. కానీ ఎంఎస్‌జీ వేసిన ఆహారాలను తినడం వల్ల మనకు ఎలాంటి హాని కలుగుతుందో ఎవరికీ తెలియడం లేదు.

ఎంఎస్‌జీ ని నిజానికి చాలా తక్కువ పరిమాణాల్లో వంటల్లో వేస్తారు. అయితే తరచూ మనం పలు సందర్భాల్లో బయటి ఆహారాన్ని ఎక్కువగా తింటుంటాం. అలాంటప్పుడు బయటి ఆహారమే ఎక్కువగా తింటే ఎంఎస్‌జీ కూడా మన శరీరంలోకి చేరుతుంది. ఇది తక్కువ మొత్తంలో శరీరంలోకి చేరితే ఏమీ కాదు. కానీ ఎక్కువ మొత్తంలో చేరితే దాంతో పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేమిటంటే...

1. ఎంఎస్‌జీ ఉన్న ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల అది శరీరంలోకి చేరి ఆహారం పట్ల మనల్ని వ్యసనపరులుగా మారుస్తుంది. అంటే.. ఆకలిగా ఉన్నప్పుడు మనం ఇది అది అని చూడకుండా ఏది దొరికితే అది తింటాం కదా. అలాగే ఎంఎస్‌జీ వల్ల మనం ఆహారానికి వ్యసనపరులమవుతాం. అది ఇది అని తేడా లేకుండా కంటికి ఇంపుగా ఏది కనిపిస్తే దాన్ని తినాలన్న కోరిక కలుగుతుంది. దాంతో అతిగా తిని ఊబకాయానికి గురవుతాం. అలాగే పలు మెటబాలిక్ సమస్యలు వస్తాయి.

2. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2 లక్షల టన్నుల సోడియం గ్లూటమేట్‌ను ప్రపంచ దేశాలు వాడుతున్నాయి. ఈ క్రమంలో అతిగా దీన్ని సేవించడం వల్ల మైగ్రేన్, బద్దకంగా ఉండడం, హార్మోన్ల అసమతుల్యత, వికారం, నీరసం, ఛాతి నొప్పి తదితర సమస్యలు వస్తున్నాయి.

3. ఎంఎస్‌జీని అతిగా సేవిస్తే మన నాలుకపై ఉండే రుచి కళికలు మరింత ప్రభావితం అవుతాయి. దీంతో ఆహారాన్ని అతిగా తిని బరువు పెరుగుతాం.

4. ఎంఎస్‌జీ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటుంటే హైబీపీ, డయాబెటిస్, కండరాలు ముడుచుకుపోవడం, కాళ్లు, చేతుల్లో సూదులు గుచ్చినట్లు అనిపించడం వంటి సమస్యలు వస్తుంటాయి.

5. సాధారణంగా ఎంఎస్‌జీని ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఎక్కువగా వేస్తుంటారు. అలాగే సాస్‌లు, చిప్స్, ప్రిపేర్డ్ సూప్స్, హాట్ డాగ్స్, బీర్లు, క్యాన్డ్ ఫుడ్స్ తదితర ఆహారాల్లోనూ వేస్తారు. కనుక ఇలాంటి తినేటప్పుడు వాటి లేబుల్‌పై ఎంఎస్‌జీ లేదా మోనో సోడియం గ్లూటమేట్ ఎంత ఉందో వెరిఫై చేసుకుని తినాలి. అసలు ఈ పదార్థం ఉన్న ఆహారాలను తినకపోవడమే మంచిది. అతిగా తింటే మాత్రం పైన చెప్పిన విధంగా అనర్థాలు కలుగుతాయి.


10638
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles