రోజూ గుప్పెడు బాదం పప్పు తింటే..


Mon,May 28, 2018 10:52 PM


గుండెజబ్బుల వల్ల మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీనికి రకరకాల కారణాలుండొచ్చు. కానీ గుండెజబ్బుల నివారణ కోసం చేస్తున్న తాజా పరిశోధనల్లో తేలిన కొత్త విషయం ఏమిటంటే రోజు గుప్పెడు బాదం పప్పు తినే వారికి గుండే జబ్బు వచ్చే అవకాశాలు తగ్గుతాయట. బాదం పప్పులో ఉండే విటమిన్ ఇ, కొవ్వు, పీచు పదార్థాలు, యాంటి ఆక్సిడెంట్ గుణాలున్న ఫ్లెవనాయిడ్లు రక్తప్రసరణను సాఫీగా సాగేలా చేస్తాయని పరిశోధనలో తేలింది. అంతే కాదు రక్తపోటును కూడా ఇది సమర్థవంతంగా అదుపు చేయగలిగిందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఆస్టన్ వర్సిటి ప్రొఫెసర్ హెలెన్ గ్రిఫిత్ అంటున్నారు.

6384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles