రోజూ ఒక గ్లాస్ రెడ్‌వైన్‌తో.. చ‌ర్మ స‌మ‌స్య‌లు దూరం..!


Wed,May 8, 2019 03:25 PM

మ‌ద్యం ప్రియులు సేవించే అనేక ర‌కాల ఆల్క‌హాలిక్ డ్రింక్స్‌ల‌లో రెడ్ వైన్ కూడా ఒక‌టి. ఈ క్ర‌మంలోనే రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగితే చ‌ర్మానికి సంర‌క్ష‌ణ క‌లుగుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. అలాగే రెడ్ వైన్ తాగ‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి కూడా అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. రెడ్ వైన్ రోజూ తాగితే వృద్ధాప్య ఛాయ‌లు అంత త్వ‌ర‌గా రావ‌ట‌. చ‌ర్మం ఎప్పుడూ కాంతివంతంగా ఉంటుంద‌ట‌. ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా ఉంటార‌ట‌.

2. రెడ్ వైన్ తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం లోప‌ల ఉండే మృత క‌ణాలు తొల‌గిపోయి చర్మం తాజాగా మారుతుంది.

3. మొటిమ‌ల స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ రెడ్‌వైన్ తాగితే మొటిమ‌లు త‌గ్గుతాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

4. రెడ్ వైన్ తాగ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

5. గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే రోజూ రెడ్ వైన్ తాగాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు.

4531
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles