రోజుకో గుడ్డు తింటే డ‌యాబెటిస్ రాద‌ట‌..!


Wed,January 30, 2019 05:02 PM

కోడిగుడ్డులో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే నిత్యం శ‌రీరానికి సంపూర్ణ పోష‌ణ అందాలంటే రోజుకో గుడ్డును తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే రోజుకో గుడ్డును తిన‌డం వ‌ల్ల పోష‌ణ అంద‌డం మాత్ర‌మే కాదు, డ‌యాబెటిస్ వచ్చే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయ‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

నిత్యం ఒక కోడిగుడ్డును తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ వ్యాధి రాకుండా చూసుకోవ‌చ్చ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే సైంటిస్టులు 239 మంది వ్య‌క్తుల‌ను 20 ఏళ్ల పాటు ప‌రిశీలించారు. రోజుకో గుడ్డు తినేవారిలో డయాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని, గుడ్డు తిన‌ని వారికి డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు తేల్చేశారు. గుడ్డులో ఉండే జీవ ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు డ‌యాబెటిస్ రాకుండా చూస్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక ఎవ‌రైనా స‌రే.. రోజుకో గుడ్డును తినాల‌ని వారు చెబుతున్నారు. కాగా సైంటిస్టులు చేప‌ట్టిన ఈ అధ్య‌య‌న వివ‌రాల‌ను మాలిక్యులార్ న్యూట్రిష‌న్ అండ్ ఫుడ్ రీసెర్చి అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.

8972
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles