వర్షాకాలంలో పచ్చి కూరగాయలు తినేవారు జాగ్రత్త..!

Tue,July 30, 2019 10:12 AM

వర్షాకాలం అంటేనే.. సహజంగానే ఈ సీజన్‌లో మనం పలు వ్యాధుల బారిన పడుతుంటాం. దగ్గు, జలుబు, జ్వరం అందరికీ కామన్‌గా వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆ అనారోగ్య సమ్యల నుంచి బయట పడేందుకు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అయితే ఈ సీజన్‌లో దాదాపుగా ఏ వ్యాధి అయినా సరే.. కలుషితమైన నీటిని తాగడం, ఆహారం తినడం వల్లే వస్తుంటుంది. అందుకని మనం తినే ఆహారాన్ని, తాగే నీటిని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.


సాధారణంగా డాక్టర్లు మనకు పచ్చి కూరగాయలను తినాలని చెబుతుంటారు. దాంతో మనం ఆరోగ్యంగా ఉండవచ్చని వారు ఉద్దేశం. అయితే మిగతా సీజన్లలో అలా తింటే ఓకే. కానీ వర్షాకాలంలో కూరగాయలను పచ్చిగా తినకపోవడమే ఉత్తమమని కూడా వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సీజన్‌లో ఉండే తేమ వాతావరణం వల్ల కూరగాయలపై అధిక సంఖ్యలో బాక్టీరియా, వైరస్‌లు ఉంటాయి. అలాంటప్పుడు వాటిని పచ్చిగా తింటే.. ఇన్‌ఫెక్షన్ల బారిన పడి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురి కావల్సి వస్తుంది. కనుక మనం పచ్చిగా తినే క్యారెట్, టమాటా, బీట్‌రూట్.. తదితర కూరగాయాలను ఉడికించి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు..!

6995
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles