ఈ 6 సూచ‌న‌లు పాటిస్తే.. అద్భుత‌మైన జ్ఞాప‌క‌శ‌క్తి మీ సొంతం..!


Sat,November 18, 2017 01:57 PM

మ‌న‌లో చాలా మంది చిన్న చిన్న విష‌యాల‌ను కూడా స‌రిగ్గా గుర్తుంచుకోలేరు. ఇట్టే మ‌రిచిపోతారు. కొంద‌రైతే ఒక్క‌సారి చూసిన ఏ విష‌యాన్న‌యినా గుర్తుంచుకుంటారు. నిద్ర‌లో లేపి దాని గురించి అడిగినా సమాధానం చెబుతారు. అంత‌టి మెమొరీ ప‌వ‌ర్ కొంద‌రికి ఉంటుంది. నిజానికి ఇదేమీ గొప్ప బ్ర‌హ్మ విద్య కాదు. కృషి చేయాలే గానీ ఎవ‌రైనా త‌మ జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. అందుకు కింద చెప్పిన టిప్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అవేమిటో ఇప్పుడు చూద్దామా..!

1. నిత్యం క‌చ్చితంగా 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. త‌గినంత నిద్ర‌లేక‌పోయినా మెదడు ప‌నితీరు మంద‌గిస్తుంది. దీంతో జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గుతుంది. క‌నుక స‌రిగ్గా నిద్ర‌పోతే జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుకోవ‌చ్చు.

2. రోజుకు క‌నీసం 30 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయాలి. అదే వారంలో క‌నీసం 5 రోజులు వ్యాయామం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరం దృఢంగా మార‌డ‌మే కాదు, మాన‌సిక ఉల్లాసం కూడా క‌లుగుతుంది. ఫ‌లితంగా ఏకాగ్ర‌త పెరుగుతుంది. మెద‌డు ప‌నితీరు మెరుగ‌వుతుంది. జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది.

3. ఏ ప‌ని చేస్తున్న‌ప్ప‌టికీ మ‌ధ్య మ‌ధ్య‌లో కొంత విరామం తీసుకోవాలి. అదే ప‌నిగా ఒకే ప‌ని నిరంత‌రాయంగా చేయ‌రాదు.

4. సుడోకు, ప‌ద‌కేళి వంటి మెద‌డుకు మేత పెట్టే ప‌జిల్స్‌ను త‌ర‌చూ పూర్తి చేయాలి. దీంతో మెద‌డు షార్ప్ గా మారి జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది.

5. నిత్యం స‌మ‌యం త‌ప్ప‌కుండా వేళ‌కు పౌష్టికాహారం తీసుకోవాలి. అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని రోజూ తినాలి.

6. నిత్యం క‌నీసం 30 నిమిషాల పాటు అయినా ధ్యానం చేయాలి. దీంతో మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. ఏకాగ్ర‌త పెరిగి మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. జ్ఞాపక శ‌క్తి వృద్ధి చెందుతుంది.

7457
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles