క్యాన్స‌ర్ రాకుండా ఉండాలంటే.. ఈ ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి..!


Mon,February 4, 2019 02:30 PM

శ‌రీరంలో నిర్దిష్ట‌మైన భాగంలో క‌ణాలు బాగా పెరిగి క‌ణ‌తుల్లా మారితే అప్పుడు ఆ భాగానికి క్యాన్స‌ర్ సోకింద‌ని అంటారు. అయితే అన్ని క‌ణ‌తులు క్యాన్స‌ర్ క‌ణ‌తులు కావు. రోజులు గ‌డుస్తున్న‌కొద్దీ క‌ణ‌తి సైజ్‌లో మార్పు వ‌చ్చినా, నొప్పి ఉన్నా దాన్ని క్యాన్స‌ర్ క‌ణ‌తిగా అనుమానించాలి. అయితే చాలా వ‌ర‌కు క్యాన్స‌ర్లను ఆరంభ ద‌శ‌లో గుర్తిస్తే చికిత్స చేయ‌డం సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది. దీంతోపాటు కింద సూచించిన ప‌లు ఆహార ప‌దార్థాల‌ను నిత్యం తీసుకుంటే దాంతో క్యాన్స‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే...

1. ప‌సుపులో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయి. ప‌సుపులో ఉండే క‌ర్‌క్యుమిన్ యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ఏజెంట్‌లా ప‌నిచేస్తుంది. అంతేకాదు, యాంటీ క్యాన్స‌ర్ ఔష‌ధంగా కూడా ప‌సుపు ప‌నికొస్తుంది. దీని వ‌ల్ల క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా ఉంటాయి. నిత్యం ఆహారంలో 3 టీస్పూన్ల ప‌సుపు తీసుకుంటే క్యాన్స‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చు.

2. వెల్లుల్లిలో అలిసిన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంది. నిత్యం మ‌నం తీసుకునే ఆహారంలో 2 నుంచి 5 గ్రాముల వెల్లుల్లి ఉండేలా చూసుకుంటే చాలు, క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకోవ‌చ్చు.

3. నిత్యం ఉద‌యాన్నే తీసుకునే అల్పాహారంలో కొద్దిగా అల్లం చేర్చి తీసుకుంటే క్యాన్స‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చు.

4. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్‌బెర్రీల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అవి క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తాయి.

5. పాలు, పాల సంబంధ ప‌దార్థాలు, చేప‌లు, క్యారెట్లు, విట‌మిన్ సి ఉండే నిమ్మ‌జాతికి చెందిన పండ్లు, న‌ట్స్‌, ఆలివ్ ఆయిల్‌, అవిసె గింజ‌లు, ట‌మాటాలు త‌దిత‌ర ఆహార ప‌దార్థాల‌ను నిత్యం తీసుకుంటే క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకోవ‌చ్చు. అలాగే క్యాన్స‌ర్ ఆరంభంలో ఉన్న‌వారు కూడా వీటిని తీసుకుంటే క్యాన్స‌ర్ క‌ణ‌తుల పెరుగుద‌ల‌ను నిరోధించ‌వ‌చ్చు.

7879
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles