పాల‌లో తేనె క‌లిపి తాగితే..?


Sun,January 6, 2019 07:01 PM

పాలు మ‌న‌కు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తాయి. దీంతో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ల‌భిస్తాయి. శ‌రీర నిర్మాణానికి ఆ పోష‌కాలు అవ‌సరం కూడా. ఇక తేనెలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉండ‌డం వ‌ల్ల మ‌న‌కు తేనెతో అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. ఇక రెండింటినీ క‌లిపి తాగితే ఏయే అనారోగ్యాలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. తేనె, పాలలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మాన్ని శుభ్రం చేస్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మచ్చలు, మొటిమలు పోతాయి.

2. జీర్ణాశయం, పేగుల్లో చెడు బాక్టీరియా నాశనమవుతుంది. మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటివి నయమవుతాయి.

3. శరీర మెటబాలిజం పెరుగుతుంది. శక్తి త్వరగా అందుతుంది. నిత్యం ఎనర్జీ లెవల్స్ బ్యాలెన్స్‌లో ఉంటాయి. దీంతో రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఎక్కువ సేపు పనిచేయగలుగుతారు.

4. ఎముకలు విరిగి ఉన్న వారు, వృద్ధులు, పిల్లలు పాలు, తేనె కలుపుకుని తాగితే కాల్షియం శరీరానికి బాగా అందుతుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముకలకు పటుత్వం చేకూరుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.

5. నిద్రలేమి సమస్యలతో బాధపడే వారికి తేనె, పాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. రోజూ రాత్రి నిద్రపోయేందుకు కనీసం 30 నిమిషాల ముందు ఈ మిశ్రమాన్ని తాగినా చాలు, నిద్ర చక్కగా పడుతుంది. ఉదయాన్నే యాక్టివ్‌గా ఉంటారు. నిద్రలేమి సమస్య దూరమవుతుంది.

6. వయస్సు మీద పడడం వల్ల చర్మంపై వచ్చే ముడతలు రావు. దీంతో ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్యం దరి చేరదు. చర్మానికి సౌందర్యం చేకూరుతుంది.

7. పాలలో తేనెను కలుపుకుని నిత్యం తాగడం వల్ల ఇన్‌ఫెక్షన్లు పోతాయి. శరీరంలో ఉండే బాక్టీరియా, వైరస్, ఇతర క్రిములు నశిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధులు అంత సులభంగా రావు.

14893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles