చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వేడి వేడి సూప్‌లు తాగితే..!


Sun,November 25, 2018 01:44 PM

చ‌లికాలంలో సాధారణంగా ఎవ‌రైనా స‌రే తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారం తీసుకోవాలి. వైద్యులు కూడా ఇదే విష‌యాన్ని చెబుతుంటారు. ఎందుకంటే ఈ కాలంలో స‌హ‌జంగానే జీర్ణ‌శ‌క్తి మంద‌గిస్తుంది. క‌నుక తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారంతో జీర్ణాశ‌యంపై అధికంగా ఒత్తిడి ప‌డ‌కుండా ఉంటుంది. అయితే తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారాల విష‌యానికి వ‌స్తే సూప్‌లు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ కాలంలో సూప్స్ తీసుకోవ‌డం ఎంతో మంచిద‌ని న్యూట్రిషనిస్టులు కూడా చెబుతున్నారు.

సూప్‌లు ఏవైనా స‌రే అవి జీర్ణం అయ్యేందుకు పెద్ద స‌మ‌యం ఏమీ ప‌ట్ట‌దు. అంతేకాకుండా సూప్‌ల‌లో ఉండే పోష‌కాలు మ‌న శరీరంలో ఏర్ప‌డే ఇన్‌ఫెక్ష‌న్ల‌తో పోరాడుతాయి. అలాగే చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో శ‌రీరానికి త‌గినంత వేడి అంద శ‌రీర ఉష్ణోగ్ర‌త క్ర‌మ‌బ‌ద్దంగా ఉంటుంది. ఒక బౌల్ నిండా సూప్‌ను తాగితే క‌డుపు నిండిన భావన క‌లుగుతుంది. దీంతో క్యాల‌రీలు త‌క్కువ‌గా ల‌భిస్తాయి. పైగా ఎక్కువ స‌మ‌యం పాటు వేచి ఉన్నా ఆక‌లి కాదు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. త‌ద్వారా బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు.

క్యాప్సికం, బ్రొకోలి, ఉల్లికాడలు, క్యారెట్స్ లాంటి కూర‌గాయ‌ల‌తో సూప్‌లు తయారు చేసి తీసుకుంటే వాటి ద్వారా మ‌న‌కు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా అందుతాయి. చికెన్‌, ఫిష్‌, ప్రాన్స్, మ‌ట‌న్‌ లలో ప్రోటీన్లు అధికం. అంతేకాదు, ఈ కాలంలో శరీరానికి తగిన వేడిని ఇస్తాయి. సూప్‌కి చిక్కదనం రావాలంటే బియ్యం, మొక్కజొన్న, ఓట్స్ పిండిని కలపాలి. ఇవి చిక్కదనానికే కాక వీటిలో శరీరానికి కావాల్సిన మంచి పోషకాలు కూడా ఉంటాయి. అంతేకాదు, సూప్‌లో అదనంగా ప్రోటీన్లు పెంచడానికి పప్పులు, నట్స్ చేర్చుకుంటే మంచిది. ఇష్టపడేవారు గుడ్డులోని తెల్లసొనను కలుపుకోవచ్చు. ఇక చ‌లికాలంలో మాంసం తింటే జీర్ణం కాద‌ని భావించే వారు వాటితో సూప్ చేసుకుని తాగ‌డం మంచిది. దీంతో ప్రోటీన్లు తేలిగ్గా జీర్ణ‌మ‌వ‌డమే కాదు, శ‌రీరానికి శ‌క్తి, వేడి కూడా ల‌భిస్తాయి.

1618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles