ద్రాక్షల్లో ప్రస్తుతం మనకు ఎన్నో రకాల ద్రాక్షలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ భిన్నమైన రుచులను కలిగి ఉంటాయి కూడా. అయితే ఏ రకానికి చెందిన ద్రాక్ష అయినా సరే.. దాంతో మనకు అనేక లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే రోజూ ఒక గుప్పెడు ద్రాక్షలను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. 2. నిత్యం ద్రాక్షలను తింటుంటే చర్మ సమస్యలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. ద్రాక్షల్లో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. గుండె సమస్యలు రాకుండా చూస్తుంది. అలాగే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 3. ద్రాక్షలను నిత్యం తినడం వల్ల మతిమరుపు రాదని, జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ద్రాక్షలతో కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. 4. కీళ్ల నొప్పులు ఉన్న వారు ద్రాక్షలను తింటే ఫలితం ఉంటుంది. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.