ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌తో గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ట‌..!


Tue,April 16, 2019 05:24 PM

ప్ర‌స్తుత త‌రుణంలో న‌గ‌రాల్లోనే కాదు, ఓ మోస్త‌రు ప‌ట్ట‌ణాల్లోనూ ట్రాఫిక్ స‌మ‌స్య రోజు రోజుకీ పెరుగుతున్న‌ది. దీంతో జ‌నాల‌కు నిత్యం ర‌హ‌దారుల‌పై న‌ర‌క యాత‌న క‌నిపిస్తున్న‌ది. గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్ జాంల‌లో వేచి చూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటోంది. అయితే.. ట్రాఫిక్ జాంల మాటేమోగానీ.. నిత్యం ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే వారికి గుండె జ‌బ్బులు ఎక్కువ‌గా వ‌స్తాయట‌. ప‌లువురు సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది.

నిత్యం ట్రాఫిక్‌లో చిక్కుకుని గమ్య‌స్థానాల‌కు త్వ‌ర‌గా చేరుకోవాల‌ని ఆందోళ‌న ఉన్న‌వారికి గుండె జ‌బ్బులు ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. గ‌మ్య‌స్థానాల‌కు వేగంగా చేరుకుంటామా, లేదా అన్న ఆందోళ‌న‌తోపాటు, ట్రాఫిక్‌లో వాహ‌నాలు చేసే చ‌ప్పుళ్ల‌కు తీవ్ర ఒత్తిడికి గురై గుండె స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక ర‌ద్దీ లేని స‌మ‌యాల్లో ర‌హ‌దారుల‌పై వెళితే ఆందోళ‌న‌ను త‌గ్గించుకోవ‌డంతోపాటు గుండె స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు.

1253
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles