పల్లీలను తినగానే నీటిని తాగరాదు.. ఎందుకో తెలుసా..?


Wed,February 7, 2018 05:14 PM

పల్లీలంటే చాలా మందికి ఇష్టమే. కొందరు వీటిని అలాగే డైరెక్ట్‌గా తినేస్తారు. ఇక కొందరు ఉప్పు, కారం వేసి రోస్ట్ చేసుకుని మరీ తింటారు. ఎలా తిన్నా ఇవి మనకు ఆరోగ్యకర ప్రయోజనాలనే అందిస్తాయి. వీటి ద్వారా మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు అందుతాయి. అయితే పల్లీలను తినగానే వెంటనే నీటిని మాత్రం తాగరాదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

పల్లీలను తినగానే నీటిని ఎందుకు తాగరాదంటే.. వీటిలో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. ఈ క్రమంలో పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్‌తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. ఇక ఈ విషయం వెనుక ఉన్న మరో కారణం ఏమిటంటే.. పల్లీలు సహజంగానే ఒంట్లో వేడిని కలిగిస్తాయి. అలాంటప్పుడు వీటిని తినగానే నీటిని తాగితే అవి చల్లగా ఉంటాయి కాబట్టి లోపల వేడి పదార్థం, చల్లని పదార్థం ఒకదానికొకటి పొసగవు. ఈ క్రమంలో దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు వస్తాయి. ఇక చివరిగా మరో కారణం ఏమిటంటే.. పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దీంతో గ్యాస్, అజీర్ణం ఇబ్బంది పెడతాయి. కనుక పల్లీలను తినగానే కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు వేచి ఉండడం ఉత్తమం. అప్పుడు కూడా వేడి నీరు తాగాల్సి ఉంటుంది. దీంతో తిన్న ఆహారం త్వరగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా జీర్ణమవుతుంది.

13994
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles