హైబీపీ ల‌క్ష‌ణాలు.. త‌గ్గించుకునేందుకు ఎఫెక్టివ్ టిప్స్‌..!


Sun,December 17, 2017 12:50 PM

హైబీపీ అనేది నేటి త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న‌ది. చాప కింద నీరులా ఇది అనేక మందికి వ‌స్తున్న‌ది. అయితే హైబీపీ ఉంటే దాని ల‌క్ష‌ణాలు కూడా చాలా మందికి తెలియ‌వు. దీంతో హైబీపీ ఉంద‌ని తెలుసుకునే స‌రికే జ‌రగాల్సిన న‌ష్టం జ‌రిగిపోతుంది. ఈ క్ర‌మంలో హై బీపీని ముందుగానే గుర్తిస్తే దాంతో జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. మ‌రి హైబీపీ ఉంటే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో, దాన్నుంచి ఎలా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!

హైబీపీ ల‌క్ష‌ణాలు


బీపీ ఎక్కువ‌గా ఉంటే తలనొప్పి, తలదిమ్ముగా ఉండటం, కళ్లు తిరగడం, తల తిరగడం, కొంతమందిలో చూపులో తేడా రావడం, వాంతులు కావడం జరుగుతుంది. ఇక బీపీ మ‌రీ పెరిగిపోతే పక్షవాతం రావచ్చు. కొందరిలో మాట తడబడటం, ముఖంలో ఒక వైపు వంకర కావడం, ఒక పక్క కాలూ చేయీ వంకర కావడం జరుగుతుంది. ఒక్కోసారి మాట పూర్తిగా పోవడం జరగవచ్చు. మెదడుకు కూడా ఎంతో న‌ష్టం క‌లుగుతుంది. క‌నుక ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే బీపీ చెక్ చేయించుకోవాలి. డాక్ట‌ర్ రాసిచ్చే మందుల‌తోపాటు కింద తెలిపిన సూచ‌న‌లు పాటిస్తే బీపీ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

1. శ్వాస తీసుకోవ‌డం


చాలా నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, కొన్ని మెడిటేషన్‌ టెక్నిక్స్‌ బీపీ విషయంలో అద్భుతాలు చేస్తాయి. అవి సునాయాసంగా ఒత్తిడిని తగ్గించి బ్లడ్‌ ప్లెజర్‌ను నార్మల్‌కు తీసుకువచ్చేస్తాయి. ఊపిరి బలంగా పీల్చడం, కొద్ది సేపు బిగబట్టి, తర్వాత నెమ్మదిగా వదిలేయడం వంటి ప్రాణాయామ టెక్నిక్స్‌ ద్వారా బీపీని సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. రోజూ ఉదయం పదినిమిషాలు, రాత్రి పదినిమిషాలు ఇలా చేయాలి. యోగా లేదా ధ్యానం క్లాసుల్లో జాయిన్‌ అయితే మరీ మంచిది.

2. పొటాషియం


పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు రక్తపోటును నియంత్రిస్తాయి. సోడియం శరీరం మీద కలిగించే దుష్ప్రభావాల్లో అధిక రక్తపోటు ఒకటి. దానిని నియంత్రించడానికి పోటాషియంను మించిన ఔషధం లేదు. పండ్లు, కూరగాయల్లో అధిక స్థాయిలో పొటాషియం ఉంటుంది. స్వీట్‌ పొటాటోస్‌, టామోటా, ఆరెంజ్‌ జ్యూస్‌, అరటిపళ్లు, బటానీ, ఎండుద్రాక్ష వంటి వాటిలో కూడా పొటాషియం అధిక పరిమాణాల్లో ఉంటుంది.

3. వాకింగ్‌


అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారికి బ్రిస్క్‌వాక్‌ (వేగంగా నడవడం) బాగా ఉపయోగపడుతుంది. వర్కవుట్లు, కార్డియో ఎక్సర్‌సైజులు ఆక్సిజన్ వినియోగాన్ని అధికం చేస్తాయి. రోజుకు దాదాపు 45 నిమిషాలపాటు ఈ వ్యాయామాలు చేస్తే బీపీ నియంత్రణలోనే ఉంటుంది.

4. డార్క్‌చాక్లెట్స్‌


డార్క్‌చాక్లెట్స్‌కు కూడా రక్తపోటును నియంత్రణలో ఉంచగలిగే శక్తి ఉంది. డార్క్‌ చాక్లెట్లు తినడం వల్ల రక్తనాళాలు ఎలస్టిక్‌ (సాగే గుణం) నేచర్‌ను సంతరించుకుంటాయి. దాదాపు 70 శాతం కొకొవాతో తయార‌య్యే డార్క్‌ చాక్లెట్‌తో చాలా ఉపయోగాలుంటాయి

5. ఆల్క‌హాల్‌


ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల గుండెపోటులు, కరోనరీ హార్ట్‌ డీసెజ్‌లు వంటివి తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది. అయితే చాలా తక్కువ మొత్తంలో ఆల్కహాల్‌ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ఉపయోగం ఉంటుంది. అవసరమైన దాని కంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నా వెంటనే శరీరంలో రక్తపోటు విపరీతంగా పెరిగిపోతుంది.

పైన చెప్పిన వాటితోపాటు అధిక బరువు ఉంటే తగ్గించుకోవడం, ఉప్పు వాడకం త‌క్కువ చేయ‌డం, హెర్బల్‌ టీలు తాగడం వంటి వాటి వల్ల కూడా రక్తపోటును సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.

7048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles