మోచేతులు న‌ల్ల‌గా ఉంటే..?


Sun,December 2, 2018 02:17 PM

మ‌న‌లో చాలా మందికి శ‌రీరంలో ఇత‌ర ప్ర‌దేశాల్లో చ‌ర్మం బాగానే ఉంటుంది కానీ.. మోచేతుల విష‌యానికి వ‌స్తే మాత్రం అక్క‌డ న‌ల్ల‌గా, గ‌రుకుగా ఉంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే అవి ఏమైన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాలంటే అందుకు కింద సూచించిన చిట్కాలు అమోఘంగా ప‌నిచేస్తాయి. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే...

1. తులసి ఆకులను మెత్తగా చేసి అందులో అరచెంచా పాలమీగడ, చిటికెడు పసుపు కలిపి రాత్రిపూట మోచేతులూ, మోకాళ్లకూ మర్దన చేసుకోవాలి. మర్నాడు చల్లటి నీళ్లతో శుభ్రపరచుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

2. రెండు మూడు రోజులకోసారి సగానికి కోసిన నిమ్మచెక్కలతో మోచేతులకు మర్దన చేస్తే నలుపు క్రమంగా తగ్గిపోతుంది. అలాగే తేనెలో చ‌క్కెర‌ కలిపి నల్లగా ఉన్న చోట రుద్దుకోవాలి. దీంతో చ‌ర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

3. గోరువెచ్చటి కొబ్బరి నూనెలో చెంచా నిమ్మరసం కలిపి చేతులకు రాసుకోవాలి. తరువాత వేడినీళ్లలో తడిపిన టవల్‌ని చుట్టుకోవాలి. వారానికోసారి ఇలా చేయడం వల్ల సమస్య క్రమంగా తగ్గుతుంది.

4. మూడు చెంచాల శనగపిండిలో కాస్త పెరుగు కలిపి పూతలా వేసుకోవాలి. ఆరాక నీళ్లతో కడిగేసుకోవాలి. అలాగే కలబంద గుజ్జు రాసుకున్నా సమస్య దూరమవుతుంది.

5. రెండు టీ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌, టీ స్పూన్ చ‌క్కెర కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల నలుపు, గరుకుదనం తగ్గిపోతాయి.

6. టొమాటో రసం, తేనె లేదా కొబ్బరి నూనెతో కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి.. బాగా మసాజ్‌ చేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్‌ చేసుకోవాలి. ఈ చిట్కాతో నలుపుదనం త్వరగా పోతుంది.

3838
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles