పుదీనాతో ఏయే అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చంటే..?


Sun,November 25, 2018 07:27 PM

నిత్యం మ‌నం పుదీనాను అనేక వంట‌ల్లో వాడుతుంటాం. పుదీనా వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తుంది. చాలా మంది పుదీనాను చ‌ట్నీ రూపంలో తీసుకుంటారు. అయితే కేవ‌లం ఆహార ప‌దార్థంగానే కాక‌, మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలోనూ పుదీనా బాగా ప‌నికొస్తుంది. ఈ క్ర‌మంలోనే పుదీనాతో ఏయే అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కడుపులో వికారంగా అనిపించినప్పుడు పుదీనా వాసనను చూస్తే చాలు వికారం మటుమాయం అవుతుంది. వాంతులతో బాధపడేవారు సైతం పుదీనా పచ్చడి తినటంవల్ల కోలుకుంటారు. గర్భిణీలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను ముద్దగా చేసి నుదుటిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది.

2. అపస్మారక స్థితిలో వెళ్లినవారికి రెండు చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే కోలుకుంటారు. చిన్న పిల్లలు కడుపునొప్పి, కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే గోరువెచ్చని నీటిలో ఐదారు చుక్కల పుదీనా రసం కాచి తాగించడం వలన ఉపశమనం కలుగుతుంది.

3. చిన్న పిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంథాల్‌ ముద్ద, కర్పూరం, కొబ్బరి నూనెలతో మిశ్రమం చేసి ఛాతికీ, వీపునకు రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేదం సూచిస్తోంది.

4. నోటి దుర్వాసనతో ఇబ్బందిపడేవారు పుదీనా రసాన్ని నీటిలో కలిపి పుక్కిలించడం ద్వారా క్రిములను దూరంగా ఉంచి దుర్వాసనను పోగొట్టవచ్చు. గొంతు నొప్పితో బాధపడేవారు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే సమస్య తొలగుతుంది. దంత వ్యాధులతో బాధపడేవారు సైతం ప్రతిరోజూ పుదీనా ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది.

5. గర్భిణీలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. పుదీనా రసం తాగటంవల్ల తరచుగా వచ్చే వెక్కిళ్లను కూడా తగ్గించవచ్చు. జలుబు చేసినప్పుడు మరిగే నీటిలో కాస్త పసుపు మెంథాల్‌ వేసి ఆవిరిపడితే జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. కీళ్ళ నొప్పులతో బాదపదేవారు తరచూ పుదీనా తింటే ఎంతో మంచిది.

11912
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles