ఈ పండు తింటే మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు దూర‌మ‌వుతాయ్‌..!


Tue,October 11, 2016 04:13 PM

కివీ పండును ఇప్పుడు చాలా మంది డెంగీ పేషెంట్లు తింటున్నారు. అందుకు కార‌ణం ప్లేట్‌లెట్ల సంఖ్య పెర‌గ‌డ‌మే. ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉండ‌డం వ‌ల్ల కివీ డెంగీకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తుంది. దీంతో వ్యాధి గ్ర‌స్తులు త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం కూడా ఉంటుంది. అయితే కేవ‌లం డెంగీకే కాదు, ప‌లు అనారోగ్యాల‌కు కూడా కివీ సూప‌ర్ ఫ్రూట్ మెడిసిన్‌గా ప‌నిచేస్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రోజుకు రెండు, మూడు కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను ఇవి అధిక శాతం వరకు తగ్గిస్తాయి.

2. శరీరంలో ఏర్పడే నైట్రేట్ ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని ఇవి తగ్గిస్తాయి. క్యాన్సర్‌కు దారి తీసే జన్యు మార్పులను నిరోధించే పదార్థం కివీలలో ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తెలిసింది. చర్మ, కాలేయ, ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది.

3. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండేలా చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే కివీ పండు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో అధికంగా ఉన్నాయి. మానసిక వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

4. రక్త సరఫరా మెరుగుపడుతుంది. శ్వాస, ఆస్తమా వంటి సమస్యలను తొలగిస్తుంది. పిల్లలకు కనీసం వారానికి ఒక సారి కివీ పండ్లను ఇస్తే దగ్గు, జలుబు వంటి అనారోగ్యాల నుంచి దూరంగా ఉంచేలా చేయవచ్చు.

5. గుండెకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించేందుకు ఉపకరిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కివీ పండ్లను ఇస్తే మంచి పౌష్టికాహారం లభించడమే కాక బిడ్డ ఎదుగుదలకు అది తోడ్పడుతుంది.

6. రక్తంలోని షుగర్ స్థాయిలను తగ్గించే గుణం కివీకి ఉంది. ఇది మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది. వీటిని తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.

7. కివీ పండులో ఉండే జింక్ పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను పెంచుతుంది. చర్మం, వెంట్రుకలు, పళ్లు, గోళ్లు తదితరాల పెరుగుదలకు జింక్ దోహదం చేస్తుంది.

12611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles