జ్ఞాపకశక్తిని పెంచే ఒమెగా 3 ఆహారాలు..!


Wed,September 26, 2018 04:25 PM

మనం తినే ఆహారంలో అనేక పోషకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఉంటాయని కూడా తెలుసు. అయితే వాటితోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అనబడే పోషకాలు కూడా మనం తినే పలు ఆహార పదార్థాల్లో ఉంటాయి. కానీ వీటి గురించి కేవలం కొద్దిమందికి మాత్రమే తెలుసు. అయితే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన మెదడుకు పోషణనిస్తాయి. ఇవి గుండె, రక్త నాళాలు, ఊపిరితిత్తులు, శరీర రోగ నిరోధక వ్యవస్థలకు బలాన్ని చేకూరుస్తాయి. ఈ క్రమంలోనే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఏయే ఆహారాల్లో ఉంటాయో, వాటిని తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వాల్‌నట్స్, చెస్ట్‌నట్స్, బాదంపప్పు, పల్లీలు, అవకాడోలు, గుమ్మడికాయ విత్తనాలు, ఆలివ్ ఆయిల్, అవిసె గింజలు, కోడిగుడ్లు, కాలిఫ్లవర్, చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మన శరీరానికి పోషణ లభిస్తుంది. దీని వల్ల ఇంకా ఎలాంటి లాభాలు కలుగుతాయంటే...

1. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాలు ఆస్తమా ఉన్న వారికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి నొప్పులను, వాపులను తగ్గిస్తాయి. ఆస్తమాను తగ్గించేందుకు సహకరిస్తాయి.

2. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలోనూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పనిచేస్తాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే చేపలను ఎక్కువగా తినమని కూడా చెబుతున్నది. దీని వల్ల రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి.

3. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాలను తినడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. రోజూ రాత్రి నిద్ర చక్కగా వస్తుంది.

4. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వల్ల మనకు కలిగే మరొక అద్భుతమైన ఉపయోగం.. జ్ఞాపకశక్తి పెరగడం. ఈ పోషక పదార్థం ఉన్న ఆహారాలను తినడం వల్ల యాక్టివ్‌గా మారుతారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

6150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles